Please assign a menu to the primary menu location under menu
Receive our editor's picks weekly
Receive our editor's picks weekly
నేత్ర న్యూస్, విశాఖపట్నం: జీవీఎంసీ జోన్-4లో పట్టణ ప్రణాళిక కార్యదర్శిలు చేతివాటం చూపిస్తూ చెలరేగిపోతున్నారు. తాము చేసిందే చట్టంగా వార్డు స్థాయిలో ఇష్టానుసారంగా వ్యవరిస్తున్నారు. గతంలో చైన్‌మాన్‌లు చేసిన అవినీతికి ఏ మాత్రం తగ్గకుండా జోన్-4 టౌన్ ప్లానింగ్ పరువుని నిలబెడుతున్నారు. ఇన్‌ఛార్జీ ఏసీపీ, టీపీవోగా వ్యవరిస్తున్న అధికారి, తన కింద టీపీఎస్ స్థాయి సిబ్బంది సైతం ఉన్నా ఇటుగా ఒక్కసారి కూడా తొంగి చూడలేదంటే భవన యజమానులు అక్కడికి ఎన్ని ముడుపులు పంపించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనుమతులు లేకుంటే విద్యుత్తు, మంచి నీరు వంటి సధుపాయాలు ఇవ్వడం కుదరదని జీవీఎంసీ కమిషనర్ ఇప్పటికే ప్రకంటించినా అటుగా ఏ ఒక్కరూ పట్టించుకోక పోవడంపై సర్వత్ర విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. దిగువ స్థాయిలో విధులు నిర్వహిస్తున్న కార్యదర్శిలు రూ.లక్షలకు కక్కుర్తి పడి భవన యజమానులకు వత్తాసు పలుకుతున్నారు. 36వ వార్డులో గత కొన్ని నెలలుగా అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనం పరిస్థితిపై సంబంధిత పట్టణ ప్రణాళిక కార్యదర్శి విట్టల్‌ను ఆరా తియ్యగా.. కాకమ్మ కబుర్లు చెప్పుతూ తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇప్పటికే రూ.లక్షలాది సొమ్మును తన ఖాతాలో వేసుకొని ఆ వార్డులో ఇన్‌ఛార్జీ మాత్రమే చేస్తున్నాను. పూర్తిస్థాయిలో సమాచారం కావాలంటే భవనం వద్దకు వెళ్లి తెలుసుకొండి అని ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇదే క్రమంలో 35వ వార్డు వెలంపేటలో నిర్మిస్తున్న మరో భారీ భవనానికి సంబంధించి సంబంధిత పట్టణ ప్రణాళిక కార్యదర్శి శ్వేతని వివరణ కోరగా ఆ భవనానికి పూర్తిస్థాయి అనుమతులు ఉన్నాయని, ఎటువంటి అదనపు అంతస్తులు నిర్మించలేదని మసిబూసి మారేడుకాయ మాటలతో తప్పించుకుంటున్నారు. ఈమెకు కూడా పెద్ద మొత్తంలో సొమ్ములు ముట్టాయని, పైగా ఓ కార్పొరేటర్ నిర్మిస్తున్న భవనం కావడంతో తానే దగ్గరుండి అక్రమ నిర్మాణానికి సంబంధించి అన్ని పనులు చూసుకుంటున్నారని సమాచారం.
జోన్-4 పట్టణ ప్రణాళిక విభాగంలో అందరికీ సమాన వాటాలు ఉంటాయని సంబంధిత కార్యాలయంలో గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. గతంలో ఛైన్‌మాన్‌లు చేసిన పనులను ఇప్పుడు నేరుగా టౌన్ ప్లానింగ్ సెక్రటరీలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. జోనల్ కార్యాలయంలో ఉండే అధికారులకు ఓ రేటు.. తమకు మరో రేటును ముందస్తుగానే ఒప్పందం చేసుకొని దండీగా దండుకుంటున్నారు. ఈ వ్యవహారంలో నకిలీ విలేకరులు కలుగజేసుకొని ఆరా తీస్తే వాళ్లకు కొంత సొమ్మును కట్టబెట్టి నిర్మాణాలను శెరవేగంగా కట్టుకుంటున్నారు.
వార్డు స్థాయిలో ఓ అక్రమ నిర్మాణం నిర్మించాలంటే మొదటిగా జీవీఎంసీ నుంచి అనుమతి పొందిన సర్వేయర్‌లు నకిలీ ప్లాన్‌లను తయారు చేసి ఓ కోడిరగ్ పద్ధతిలో సంబంధిత టౌన్‌ప్లాన్‌ంగ్ అధికారికి అందిస్తున్నారు. అక్కడ నుంచి ఇరు వర్గాల మధ్య రహస్య సమావేశాలను ఏర్పాటు చేసి ఒప్పందం చేసే వరకు పూర్తి బాధ్యత సర్వేయర్‌లే తీసుకుంటారు. ఆ తరువాత ప్లానింగ్ సెక్రటరీ ద్వారా మరోమారు దాడి చేసి మరోమారు రూ.లక్షల సొమ్మును రుచి చూస్తారు. అక్కడితో వదిలిపెట్టకుండా ప్లానింగ్ కార్యదర్శి మరికొంత సొమ్ము తీసుకొని చూసి చూడనట్టు వార్డులో వ్యవరిస్తారు.
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : జీవీఎంసీ జోన్-4లో టౌన్‌ప్లానింగ్ రింగ్ మాస్టర్‌లు రెచ్చిపోతున్నారు. వార్డు స్థాయిలో జీవీఎంసీ ఉన్నతాధికారుల పర్యావేక్షణ లోపంతో ఇష్టానుసారంగా అనధికార అంతస్తులతో భవనాలను నిర్మిస్తున్న యజమానులకు అండగా ఉంటూ దండుకుంటున్నారు. సక్రమంగా నిర్మించే భవనాలకు అనుమతులు ఇవ్వడానికి రూ.లక్షల్లో దండుకుంటున్న టౌన్‌ప్లానింగ్ అధికారులు అక్రమంగా అదనపు అంతస్తులతో నిర్మించే భవనాల వద్ద ఎంత మొత్తంలో వసూలు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాతనగరంలో గల పలు వార్డుల్లో తమదైన శైలిలో విరుచుకుపడుతూ టౌన్‌ప్లానింగ్ సిబ్బంది వీరంగం సృష్టిస్తున్నారని పలు సమాచార మార్గాల ద్వారా సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వస్తున్నా అటుగా పట్టించుకునే నాథుడే లేడని పలువురు ఆరోపిస్తున్నారు.
జోన్-4 టౌన్‌ప్లానింగ్ విభాగంలో చాలా ఏళ్లుగా పాతుకుపోయిన సిబ్బంది తాము ఆడిరదే ఆటగా.. పాడిరదే పాటగా.. మారిపోయిందని, దీనికి తోడు కొత్తగా వచ్చిన వార్డు సచివాలయ సిబ్బంది తమదైన శైలిలో విధులు నిర్వహించకుండా బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్, చైన్‌మాన్ సిబ్బంది కనుసైగల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. దీనికి గాను అప్పనంగా వచ్చిన ఆమ్యామ్యాలు తీసుకొని తప్పించుకుంటున్నారు. ఇరుకు సందుల్లో నాలుగైదు అంతస్తులు నిర్మిస్తూ స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నా అటుగా సంబంధిత జీవీఎంసీ అధికారులు చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం తీవ్ర విస్మయానికి గురిచేస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికైనా సంబంధిత జీవీఎంసీ ఉన్నతాధికారులు స్పందించి జోన్-4 టౌన్‌ప్లానింగ్ సిబ్బంది, వార్డు ప్లానింగ్ సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ప్రజల నుంచి రూ.లక్షలు కాజేస్తున్న కాటికాపరుల నుంచి ఇప్పటికైనా పూర్తి స్థాయిలో విముక్తి కల్పించాలని పలువురు ప్రజలు ప్రాధేయపడుతున్నారు.
వార్డు స్థాయిలో విధులు నిర్వహించే టౌన్‌ప్లానింగ్ చైన్‌మెన్ సిబ్బంది చేస్తున్న చేష్టలకు పేద ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తుంది. జోన్-4 పరిధిలో పనిచేస్తున్న చైన్‌మాన్‌లు జీవీఎంసీ అనుమతి పొందిన సర్వేయర్‌లతో చేతులు కలిపి అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. తీరా బిల్డింగ్‌లకు అనుమతి ఉందా..? అని ప్రశ్నిస్తే అన్ని అనుమతులు ఉన్నాయని, సర్వేయర్‌ల నుంచి తీసుకున్న నకిలీ ప్లాన్‌లను చూపించి తప్పించుకుంటున్నారు. వార్డు పరిధిలో ఎక్కడ నిర్మాణం నిర్మిస్తున్న టౌన్‌ప్లానింగ్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందరూ పెళ్లికి వెళ్లినట్టు గుంపుగా వెళ్లి బేరసారాలు చేస్తున్నారు. అక్కడ వ్యతిరేక పరిణామాలు ఎదురైతే వెంటనే కన్నెర్ర చేసి నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. జోన్`4లో ఎన్నో ఏళ్ల తరబడి ఒకే విభాగంలో పాతుకుపోయిన టౌన్‌ప్లానింగ్ సిబ్బంది వార్డులో చేసిందే చట్టంగా మారింది. ఇప్పటికే రూ.లక్షలాది సొమ్మును దండుకున్న టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్, చైన్‌మాన్ సిబ్బంది ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టుకున్నారని జోన్-4లో విధులు నిర్వహిస్తున్న తోటి ఉద్యోగులే గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికైనా జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగంపై అవినీతి నిరోధక శాఖ దృష్టి కేంద్రీకృతం చేయాలని పలువురు ప్రజలు ప్రాధేయపడుతున్నారు.