Please assign a menu to the primary menu location under menu
Receive our editor's picks weekly
Receive our editor's picks weekly
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : భక్తుల కోర్కెలను తీర్చే భగవంతునికే కష్టాలు తప్పడం లేదు. ఆయన కొలువైన మార్గంలో అడుగడుగునా ఆటంకాలు అడ్డుపడుతూ అగమ్యగోచరాన్ని తలపిస్తున్నాయి. విశాఖపట్నంలో ప్రధమ దేవాలయంగా పేరుగాంచిన సింహాచలం శ్రీ అప్పన్న స్వామి అనుసంధాన దేవాలయం భైరవకోన కాలభైరవుడు కష్టాల మార్గంలో కొలువై ఉన్నారు. అమావాస్య పూజునిగా పేరొందిన కాలభైరవ స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో అడుగడుగునా ఆటంకాలు అడ్డుపడుతూ ప్రజలకు ముప్పతిప్పలు పెట్టిస్తున్నాయంటే ఆశ్చర్యం చెందనవసరం లేదనే చెప్పాలి. మాసంలో అమావాస్య రోజున స్వామి దర్శనానికి సుధూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఓ వైపు ప్రధాన రహదారి ఇబ్బందులకు గురిచేస్తుంటే.. మరోవైపు ఆలయ సిబ్బంది చేస్తున్న చేష్టలతో నరకయాతన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖకు చెందిన ప్రాంతంలో రాకపోకల మార్గం నిర్మించడానికి ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయని.. అంతటిని సైతం దాటుకొస్తున్న భక్తులకు ఆలయ సిబ్బంది చేస్తున్న చేష్టలు చిరాకు తెప్పిస్తున్నాయని మండిపడుతున్నారు. స్థానిక సిబ్బందితో పాటుగా సింహాచలం దేవాస్థానం నుంచి డిప్యూటేషన్‌పై విధులకు వస్తున్న ఆలయ సిబ్బంది చూపిస్తున్న బంధు ప్రీతి ప్రజలను గంటల తరబడి క్యూలైనుల్లో నిలబెట్టిస్తుంది. కిలో మీటర్ దూరం క్యూలైన్‌లో ఉన్న భక్తులు గంటలు గడుస్తున్నా ఆ కిలో మీటర్ దూరానికే పరిమితం అవ్వడం వలన భక్తుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఆలయ ఉన్నతాధికారులు సరైన పద్ధతులను అవలంభించక పోవడంతో అడుగడుగున భక్తులు అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. ఆలయం వద్ద పైరవీలు పర్వం పెరిగిపోవడంతో క్యూలైనుల్లో పడిగాపులు కాస్తున్న భక్తులు ఎండ వేడికి సొమ్మసిల్లి పోతున్న ఘటనలు కోకొల్లలు. చిల్లరకు కక్కుర్తి పడుతున్న సిబ్బంది ఉన్నంత వరకు ఈ ఆలయ అభివృద్ధి అడవి మధ్యలోనే ఉంటుందని పలువురు పలు రకాలుగా విమర్శిస్తున్నారు. ఈమధ్య పదుల సంఖ్యలో కార్యనిర్వహణాధికారులు మారుతున్న ఈ అరణ్య మార్గంలో ఉన్న కాలభైరవునికి సరైన రోడ్డు మార్గాన్ని నిర్మించలేకపోతున్నారని పలువురు ప్రజలు పరుషంగానే ప్రశ్నిస్తున్నారు.