Please assign a menu to the primary menu location under menu

Friday, April 19, 2024

Tag Archives: PSPK

Political

జనసేన పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

 నేత్ర న్యూస్, విశాఖపట్నం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ స్థాపించి తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని పదవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆధ్వర్యంలో పలు సేవ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మద్దిలపాలెం, పిఠాపురం కాలనీ కళాభారతి వద్ద జనసేన ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా జనసేన జెండాను ఎగరవేయాగ జనసైనికులు జెండా వందనం చేశారు. అనంతరం పది కేజీల కేక్ కట్ చేసి జనసైనికులకు అందజేసి పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు.

అనంతరం రోటరీ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో జనసైనికులు, అభిమానులు కార్యక్రమంలో పాల్గొని రక్త దానం చేశారు. ఈ సందర్భంగా మూర్తి యాదవ్ మాట్లాడుతూ వైసిపి అరాచక పాలనలో రాష్ట్ర ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారన్నారు. ముఖ్యంగా చదువుకున్న యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం వలన తీవ్ర నిరాశ నిసృహులకులోనై  ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల్లో యువత పవన్ కళ్యాణ్ కి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. అందుకు ఇటీవల రణస్థలంలో జరిగిన యువగళం సభ విజయవంతం కావడమే నిదర్శనం అన్నారు. పార్టీ కార్యకర్తలు, శ్రేణులు జనసేన అభివృద్ధికి, రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడానికి ఇంత మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకు రావడాన్ని ఆయన అభినందించారు. సుమారు 100కి పైగా జనసైనికులు, వీర మహిళలు రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో చైతన్య, రూప, శేఖర్, పీతల మదుసూదన్ రావు, పండు, సత్యం, తిరుమల, రవి, కిషోర్ పాల్గొన్నారు.

EntertainmentPolitical

ఘనంగా పవర్ స్టార్ పుట్టిన రోజు వేడుకలు

– పోలమాంబ అమ్మవారి ఆలయంలో 1001 కొబ్బరికాయలతో ప్రత్యేక పూజలు..
– మానసిక వికలాంగుల పాఠశాలలో కేక్ కటింగ్..
– విమ్స్ లో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ..

నేత్ర న్యూస్, విశాఖపట్నం: జనసేన కొర్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్ద వాల్తేర్ కరక చెట్టు పొలమంబ అమ్మవారి దేవాలయంలో పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి 1001 కొబ్బరి కాయలు కొట్టి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ఉండాలని వేడుకున్నారు.

ఆదర్శ్ నగర్ హిడెన్ స్పోర్ట్స్ మానసిక వికలాంగుల పాఠశాలలో కేక్ కట్టింగ్ చేసి మానసిక వికలాంగుల చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం విమ్స్ హాస్పిటల్ లో రోగుల అందరికీ పండ్లు, రొట్టెలు, పానీయాలు పంపిణీ చేసి జనసైనికులు సంబరాల్లో మునిగి తేలారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పవర్ ఏంటో అధికార పార్టీకి చూపిస్తామన్నారు. ఆంధ్రలో ప్రతీ ఒక్కరూ పవన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరుగుతున్న పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ సంబరాలే దీనికి ఉదాహరణ అన్నారు. పవన్ అభిమానులు, జన సైనికులకు, ప్రజలు ఒక పండుగలా పవన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం రాష్టానికి కొత్త నాయకత్వాని ఆహ్వానించండమేనన్నారు. పవన్ జనాదరణకు అధికార, ప్రతిపక్ష పార్టీలు బయపడ్తున్నాయన్నారు. ఆయన పుట్టిన రోజున సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. కార్యక్రంలో పెద్ద ఎత్తున పాల్గున్న పవన్ అభిమానులు, మెగా అభిమానులు పాల్గున్నారు.

EntertainmentPolitical

పవన్ కళ్యాణ్ కి ఛాలెంజ్ చేసిన మంత్రి కేటీఆర్

నేత్ర న్యూస్: తెలంగాణ మంత్రి కేటీఆర్ విసిరిన ఛాలెంజ్‌ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ యాక్సెప్ట్ చేశారు. ఇంతకీ ఏం ఛాలెంజ్ అనుకుంటున్నారా..? చేనేత ఛాలెంజ్.. ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత బట్టలు ధరించి ఆ ఫోటోలు లేదా వీడియోలు పోస్ట్‌ చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా దిగ్గజ క్రికెటర్ సచిన్‌ టెండూల్కర్‌, పవన్‌ కళ్యాణ్‌, ఆనంద్‌ మహీంద్రాలకు మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో ఛాలెంజ్ విసిరారు. ట్విటర్‌లో ఈ ఆసక్తికర విషయం చోటుచేసుకోవడంతో ఒక వైపు పవన్ అభిమానులు మరో వైపు కేటీఆర్ అభిమానులు సంబ్రమాశ్చర్యంలో పడ్డారు.

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ #MyhandloomMyPride ఛాలెంజ్‌ను స్వీకరించి మరో ఇద్దరిలో మంత్రి కేటీఆర్‌ను నామినేట్ చేశారు. ఈ ఛాలెంజ్‌లో నామినీలు చేనేత దుస్తులు ధరించిన వారి చిత్రాలను పోస్ట్ చేయాలి.. అదే విధంగా చేయడానికి మరో ముగ్గురిని నామినేట్ చేయాలి. మంత్రి కేటీఆర్ సవాల్‌గా తీసుకుని సచిన్ టెండూల్కర్, ఆనంద్ మహీంద్రాతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను నామినేట్ చేశారు. కొన్ని గంటల్లో పవన్ కళ్యాణ్ ఛాలెంజ్‌ని స్వీకరించి, చేనేతలో ఉన్న తన చిత్రాలను పోస్ట్ చేశాడు.

ఇక్కడితో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చూశామనేలోపే పవన్ కళ్యాణ్ చేసిన ఛాలెంజ్ ఏపీలో రాజీకీయా అనుమానాలతో పాటుగా పొత్తుల టాపిక్ మల్లి బయట పడింది. ఆసక్తికరంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు వైసీపీ మాజీ మంత్రి బాలినేని వాసు, బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌లను ఆయన నామినేట్ చేశారు.

“@KTRTRS రామ్ భాయ్ యొక్క ఛాలెంజ్ ‘మా నేత కమ్యూనిటీల పట్ల నా ప్రేమ మరియు అభిమానానికి కారణం. ఇప్పుడు నేను శ్రీ @ncbn శ్రీ @balineni_vasu శ్రీ @drlaxmanbjpని నామినేట్ చేసాను. వారి చేనేతతో ఉన్న చిత్రాలను పోస్ట్ చేయడానికి, #NationalHandloomDayలో వారి ప్రేమను తెలియజేయాలని ”పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో రాశారు.

Entertainment

పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్..!

-నేత్రన్యూస్‌: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి ఒక చారిత్రాత్మకా అంశంతో సినిమా చేస్తున్నారు. అనగానే అభిమానుల్లో తెలియని ఉత్సాహం నెలకొంది. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా రూపొందుతున్న ఈ సినిమాకి ఏఎం రత్నం నిర్మాతగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ గత కొద్దిరోజులుగా నిలిచి పోయింది. అయితే దీనికి కారణం క్రియేటివ్ డిఫరెన్సెస్ అని తెలుస్తోంది. హరిహర వీరమల్ల రషెష్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ సంతృప్తి చెందలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని మార్పులు చేర్పులు పవన్ కళ్యాణ్ క్రిష్ కి సూచించారని తెలుస్తోంది. హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్తగా ఒక యోధుడిగా కనిపించబోతున్నట్లు ఫస్ట్ లుక్కుతోనే ఒక క్లారిటీ ఇచ్చేశారు. అయితే మధ్యలో ఆ సినిమా మేకింగ్ విధానంలో మార్పులు చేయాలి అని పవన్ కళ్యాణ్ అప్సెట్ అయినట్లు అలాగే వెనుకడుగు వేసినట్లుగా టాక్ అయితే వచ్చింది.

అంతే కాకుండా సినిమా షూటింగ్ కూడా మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉందని నిర్మాత ఆర్థిక పరిస్థితుల వలన కూడా పూర్తి కాకపోవచ్చు అని రూమర్స్ కూడా వచ్చాయి. కానీ ప్రస్తుతం చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఎప్పటిలానే షూటింగ్ పనుల్లో బిజీ అయిపోయారు. పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ ఎంతో సినిమా అవుట్ ఫుట్ పై నమ్మకంగా ఉన్నారని సినిమా తప్పకుండా అనుకున్న సమయానికి విడుదల చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన విడుదల చేయాలని కూడా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి అది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొంతకాలం ఆగాల్సిందే. అలాగే పవన్ పుట్టినరోజు సందర్భంగా హరీష్ శంకర్ సినిమా అప్డేట్ కూడా రావచ్చని టాక్ వస్తోంది.