Please assign a menu to the primary menu location under menu
Receive our editor's picks weekly
Receive our editor's picks weekly
పార్కింగ్ పేరిట అధిక ధరలు వసూలు చేస్తున్న గజ దొంగలు..
నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఆశీల వసూలుదారులు..
నేత్ర న్యూస్, విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి) : పూర్ణామార్కెట్‌గా గుర్తింపు పొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్‌లో ఆశీలు వసూలు చేస్తున్న గుత్తేదారులు అక్కడ ప్రజలను, చిరు వ్యాపారులను దోచుకుంటున్నారని బోరున విలపిస్తున్నారు. మార్కెట్‌లో ఉండే వ్యాపారులతో పాటుగా సరుకులను ఎగుమతి, దిగుమతులు చేసే వాహన చోదకులను, అటుగా వచ్చే వినియోగదారులను సైతం బెంబేలెత్తిస్తూ జీవీఎంసీ తరుపున ఆశీలు వసూలు చేస్తున్నామని అందినకాడికి దోచుకుంటున్నారు. గత కొన్ని నెలలుగా ఈ తంతు జరుగుతున్న సంబంధిత ఉన్నతాధికారులు స్థానిక కార్పొరేటర్ మాటకు వత్తాసు పలుకుతూ వస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. జీవీఎంసీకి సంబంధించిన ఆస్తులను ప్రతీ ఏడాది బహిరంగ వేలం పాట ద్వారా గుత్తేదారులకు అప్పగించి వాటిపై వచ్చే ఆదాయాన్ని నగరాభివృద్ధికి ఉపయోగించే క్రమంలో ఈ దొంగ గుత్తేదారులు పుట్టుకొస్తున్నారు. విశాఖలో అధిక ఆదాయాన్ని సమకూర్చే ఆస్తుల్లో కీలకమైన
ఆస్తి పూర్ణామార్కెట్ ఒకటి. ఈ క్రమంలో జోన్-4 కార్యాలయ
పరిధిలో ఉండే ఈ పూర్ణామార్కెట్‌ను ప్రతీ ఏడాది ఇచ్చే విధంగానే గత దొంగల కంటే ముదురు దొంగలకు అప్పగించడంతో ప్రజలు, వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారని గుత్తేదారులకు అప్పగించిన పలువురు దిగువ స్థాయి సిబ్బందే గుసగుసలాడుకుంటున్నారు. జీవీఎంసీ ముందస్తుగా ఇచ్చిన గెజిట్ నిబంధనలు ప్రకారం స్కూటర్ పార్కింగ్‌కి రూ.2 వసూలు చేయాల్సిన గుత్తేదారులు రూ.10లు, కారుకి రూ.5లకు బదులు రూ.30లు వసూలు చేస్తున్నట్టు రశీదులు సైతం ఇస్తున్నారు. దీంతో పాటుగా అనధికారికంగా రహదారిపై జంగిడీలతో వ్యాపారాలు చేసే వ్యాపారుల నుంచి రూ.200నుంచి రూ.350వరకు వసూలు చేస్తున్నారు. ఇదే క్రమంలో సరుకులతో అటుగా వచ్చే భారీ, మధ్యతరహా వాహనాలు వస్తే చాలు గెజిట్‌లో ఎక్కడా లేని రశీదులను ముద్రించి రూ.300వరకు దౌర్జన్యంగా దోచుకుంటున్నారు. భాషపై పట్టులేని ఇతర రాష్టాల నుంచి వచ్చే వాహన చోదకులు కనిపిస్తే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు రూ.200ల రశీదులో నగదు విలువను చింపి సుమారు రూ.500వరకు వసూలు చేస్తున్నారని పలువురు వాహన చోదకులు బోరుమంటున్నారు. ఈ తరహా వ్యవహారాలను సంబంధిత జీవీఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఇప్పటి వరకు ఫిర్యాదులు తమకి రాలేదని, వస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పడం గమనర్హం.
– మార్కెట్‌ని దోచుకోవడంలో ముదురులు..
జీవీఎంసీ నుంచి గుత్తేదారుడిగా బి.శ్రీరామమూర్తి ఆర్‌సీ నెంబర్ 712/2024 పేరిట అధికారం కైవసం చేసుకొని రశీదులు సైతం ముద్రించారు. కానీ ఇక్కడ సమాన వాటాలతో పూర్ణామార్కెట్ ఆశీల వ్యవహారంలో పాల్గొన్న ముగ్గురు పాటదారులు రింగుగా ఏర్పడి వాటాలు పంచుకుంటున్నారని పలువురు వ్యాపారస్తులు వెల్లడిస్తున్నారు. గెజిట్‌లో ఎక్కడా లేని విధంగా అనధికారికంగా జంగిడీ, తమలపాకుల వ్యాపారుల నుంచి రూ.250 చొప్పున వసూలు చేస్తున్నారు. అదే పండుగ రోజుల్లో అయితే ఇష్టానుసారంగా రూ.500లకు పైగా వసూలు చేస్తున్నారు. పలువురు వ్యాపారులు వివరిస్తున్నారు. వాస్తవానికి పూర్ణామార్కెట్ ఆశీల వ్యవహారంలో సంబంధిత వార్డుకి సంబంధించిన కార్పొరేటర్ భాగస్వామ్యం కూడా ఉందని, ఆయనతో పాటుగా ప్రతీసారి ఆశీల పాటలో డీడీని చెల్లించి రింగ్ అవుతున్న మరో ఇద్దరి భాగస్వామ్యం కూడా ఉందని ఆశీలు వసూలు చేస్తున్న వ్యక్తులే వెల్లడిస్తున్నారు.
– ఎవ్వరైనా ఫిర్యాదు ఇస్తే వెంటనే రద్దు చేస్తాం..
జీవీఎంసీ గెజిట్‌లో ఇచ్చిన ధరల కంటే అధికంగా వసూలు చేయడం చట్టరీత్యా నేరం. ఎవ్వరైనా సరే బాధితులు నేరుగా వచ్చి ఫిర్యాదు ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. ఉన్నతాధికారులు, కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తాం. అక్కడ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తాం.
– ఎం.మల్లయ్య నాయుడు (జోన్-4 జోనల్ కమిషనర్).
నేత్రన్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి): శ్రావణ మాస పూజల సందర్భంగా రద్ధీని సంతరించుకున్న పూర్ణామార్కెట్‌లో దళారులు ఇష్టానుసారంగా వ్యవరించారు. మార్కెట్‌లో చిరు వ్యాపారాలు చేసుకొనే పేద ప్రజలనే లక్ష్యంగా చేసుకొని చెలరేగిపోయారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు దౌర్జన్యంగా వ్యవరించారని ప్రలువురు చిరు వ్యాపారస్తులు బోరుమంటున్నారు. రెండోవ శ్రవణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కావడంతో దళారులు దండుకోవడానికి సిద్ధమైపోయారు. బుధ, గురువారం రోజుల్లో స్థానికంగా జరిగే వ్యాపారాల సమయంలో ఒక ముఠా అధికారాన్ని చూపించుకొని దండుకుంటే.. మరో ముఠా అవకాశాన్ని చూసుకొని దండుకుందనే చెప్పాలి. ముచ్చటగా ముడో ముఠా కార్మిక సంఘం పేరిట రశీదులు ఇస్తూ వసూళ్లకు పాల్పడం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా జీవీఎంసీ వసూలు చేయాల్సిన ఆశీలు గుత్తేదారులు బ్యాంక్ గ్యారంటీతో పాటుగా చెల్లించాల్సిన సొమ్ము చెల్లించలేదని తాత్కలికంగా ఈసారి వసూలు చేయకపోవడంతో అదునుచూసుకున్న దందా దారులు దండీగానే దండుకున్నారు. ప్రభుత్వం నుంచి నెలవారీ వచ్చే జీతాలతో శాంతించని మూడో సింహం చిరు వ్యాపారస్తులపై పంజా వేయడంతో బెంబేలెత్తిపోయి అడిగిన సొమ్మును చక్కగా చెల్లించామని వెల్లడిరచారు. ఇదే సమయంలో పూర్ణామార్కెట్‌లో సర్ధార్ వల్లభాయ్ పటేల్ వర్తక సంఘం పేరిట స్థావరం ఏర్పాటు చేసుకున్న సంఘ సభ్యుల్లో ఇద్దరు వ్యక్తులు మరో కోణంలో దందాను నడిపారు. సంఘం స్థానికంగా విశాఖ విజయ వినాయక పేరిట ఆలయాన్ని ఏర్పాటు చేస్తే.. ఆ ఆలయ అభివృద్ధి పేరిట వృద్ధిగానే దండుకున్నారు. మరో వైపు కార్మికుల కష్టాలను తమ కష్టాలుగా తీసుకొని అండదండగా ఉండాల్సిన కార్మిక సంఘ ఓ కీలక నాయకుడు సైతం రద్ధీగా ఉండే మార్కెట్‌లో కార్మిక సంఘం పేరిట రశీదులు ఇచ్చి ఇష్టానుసారం వసూళ్లకు పాల్పడటం సరైన పద్ధతి కాదని పలువురు వ్యాపారులు వాపోతున్నారు. కార్మిక సంఘానికి ఇష్టంతో చందాలు ఇవ్వాలి కానీ అవకాశం చూసుకొని ఈ విధంగా వసూలు చేయకూడదని మండి పడుతున్నారు. ఏది ఏమైన పేద ప్రజలపై ప్రతీ ఒక్కడు పెత్తనం సాధించడం ఈ పూర్ణామార్కెట్‌లోనే చెల్లింది.
– పూర్ణామార్కెట్‌లో ట్రాఫిక్ పోలీసుల దందా..!
నెలవారీ పెద్ద మొత్తంలో ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న జీతాలతో సంతృప్తి చెందని పోలీసులు పేద ప్రజలను పీడిస్తున్నారనే చెప్పాలి. పూర్ణామార్కెట్ రహదారిపై రద్ధీని అదుపు చేయాల్సిన ట్రాఫిక్ పోలీసులు అదే రద్ధీలో ఉన్న చిరు వ్యాపారుల నుంచి రూ.100 చొప్పున దండుకున్నారు. నేరుగా దండుకుంటే ఉన్నతాధికారులతో పాటుగా పత్రికా విలేకరుల దృష్టిలో పడతారని గ్రహించి స్థానికంగా ఓ దళారిని నియమించుకున్నారు. గాజుల వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తితో దందాను కొనసాగించారని డబ్బులు చెల్లించిన వ్యాపారస్తులు వెల్లడిస్తున్నారు. దుకాణం నుంచి రూ.100చొప్పున సుమారు 400దుకాణాల నుంచి రూ.40వేలకు పైగా సొమ్మును దండుకున్నారని పలువురు వ్యాపారస్తులు అంచనా వేస్తున్నారు.
– వర్తక సంఘం పేరిట ఆ ఇద్దరూ పీడిరచారు..!
వ్యాపారస్తుల అభివృద్ధి ధ్యేయంగా ఏర్పడిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్ వర్తక సంఘంలో చీడ పురుగులు పెచ్చురేగిపోతున్నాయి. సంఘం నూతనంగా ఏర్పాటు చేసిన ఆలయ అభివృద్ధికి నిధులు సేకరిస్తున్నట్టు ఓ కొత్త నాటకానికి తెరతీశారు. మార్కెట్‌లో రద్ధీని అదును చూసుకున్న ఇరువురు వ్యక్తులు ఆలయ అభివృద్ధి పేరిట ప్రతీ వ్యాపారస్తునికి రూ.50 నుంచి రూ.100వరకు అభివృద్ధి నిధులు ముక్కుపిండి వసూలు చేశారు. దీనిపై ఓ సంఘ సభ్యుడ్ని ప్రశ్నించగా ఆలయాన్ని సంఘంలో సొమ్ముతో పాటుగా కొంత మంది దాతల సాయంతో నిర్మించామని, ఇప్పుడు ఆలయానికి ఎటువంటి ఇబ్బందులు లేవని వెల్లడిరచారు. రద్ధీ వ్యాపారాలను అదును చూసుకొని ఎటువంటి వసూళ్లకు సంఘం పాల్పడలేదని, అటువంటివి పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని వెల్లడిరచారు.
– కార్మికులు ఇష్టంతో కాదు కష్టంతో ఇచ్చారు..!
ఏడాదిలో సుమారు నాలుగైదు సార్లు భారీగా జరిగే వ్యాపారాల్లో స్థానికంగా ఉన్న గుత్తేదారులు లాభాన్ని తీసుకెళ్లిపోతున్నారని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించని కార్మిక సంఘం కాసుల కోసం రావడం మరీంత ఇబ్బందిగా ఉందన్నారు. కార్మికులకు అండగా ఉంటామని చెప్పిన సంఘం ఎప్పుడూ కనిపించకుండా రద్ధీగా వ్యాపారాలు చేసుకుంటున్న సమయంలో చందా పేరిట బలవంతపు వసూళ్లు చేశారని వెల్లడిరచారు. ఈసారి గుత్తేదారులు వసూలు చేయలేదని సంతోషించే సమయంలో ఓ వైపు పోలీసులు, మరోవైపు మార్కెట్ సంఘ సభ్యులు, ముచ్చటగా కార్మిక సంఘ నాయకుడు చందాలు వసూలు చేయడం ఇబ్బంది కల్గించిందని తెలిపారు. కార్మిక సంఘానికి చందా అనేది ఇష్టంతో ఇవ్వాలి కానీ.. రద్ధీ వ్యాపారాల్లో కష్టంగా తీసుకోవడం సభువు కాదని మండిపడ్డారు. తమ తరుపున నిలబడి దందా దారులను అడ్డుకోవల్సిన వ్యక్తులు సైతం రశీదులు తీసుకొచ్చి చందాలు చెల్లించాలని చెప్పడం అయోమయానికి గురిచేసిందనే చెప్పాలి.