Please assign a menu to the primary menu location under menu
Receive our editor's picks weekly
Receive our editor's picks weekly
బాల్యాన్ని సక్రమమైన పద్ధతిలో మలుచుకుంటే బంగారు భవిత సొంతమవుతుందని అక్కడి ఉపాధ్యాయుల దృఢ నమ్మకం. అదే మార్గాన్ని అక్కడ అందిపుచ్చుకోవడంతో ఆ విద్యార్ధులకు విజయావకాశాలు పుష్కలంగా అందుతున్నాయి. విద్యా వ్యవస్థలో ఉండే లోటు పాట్లును ప్రయోగాత్మకమైన పద్ధతిలోకి తీసుకొచ్చి ఫలితాలను చూసిన స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ డైరక్టర్ మళ్ల రామునాయుడు చేసిన ఓ చిన్న ప్రయత్నం పెద్ద వృక్షమై ఇప్పుడు తియ్యని ఫలాలనందిస్తుందని ఆ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో మార్పులకు అనుగుణంగా విద్యాబోధన అందిస్తునే తమదైన పద్ధతిలో మెలుకువలు నేర్పించడంతో స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్‌లో చిన్నారులు వండర్స్ సృష్టిస్తున్నారు. చిట్టి పొట్టి చిన్నారులకు పుస్తకాలతో ఒత్తిడి ఉండకూడదని, ఆడుకునే వయసులో ఆట బొమ్మలు తప్ప పుస్తకాల బరువులు తెలియకూడదని ఆయన దృఢంగా నమ్మారు. సరికొత్త ఆలోచనతో ప్రారంభించిన ప్రయోగంలో మొదట ఒడుదుడుకులు వచ్చినా ఎట్టకేలకు విజయతీరాలను చేరుకొని వందలాది రికార్డులను కైవసం చేసుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఓ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ అక్కడి విద్యార్థులపై చేసిన ప్రయోగం నేటికి వదిలి పెట్టలేదనే చెప్పాలి. అక్కడి చేసిన మొదటి ప్రయత్నంలో చిరు సమస్యలు వచ్చినా పట్టు వదలని విక్రమార్కుడిలా ఆ ప్రయోగాన్ని పట్టి పట్టి ప్రయత్నించడంతో అద్భుతాలు సృష్టించిన వ్యక్తిగా నిలిచారు. ఆ తరువాత 2001లో స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ పేరిట ఓ ప్రయోగశాలనే ప్రారంభించారు. తమ వద్దకు వస్తున్న చిట్టి పొట్టి చిన్నారుల చేతుల్లో బొమ్మలు మాత్రమే చూడాలని, పుస్తకాలను అప్పుడే చూడకూడదని నిర్ణయించుకొని ప్రయోగాలను కొనసాగించారు. త్వరలో దేశమంతట ఉపయోగించనున్న నూతన విద్యా విధానాల అనుగుణ పద్ధతులను 2001లోనే ప్రారంభించి నేటికి 130కి పైగా రికార్డులను కైవసం చేసుకొని దేశ నలుమూలలకు చాటి చెప్పారు. కేజీ నుంచి ఆపై తరగతులు చిన్నారులకు చెప్పే ఉపాధ్యాయులకు కూడా ఇక్కడ ప్రత్యేక తరగతులు ఉంటాయంటే ఆశ్చర్య పడనవసరం లేదు. ప్రతీ అంశంలో ఓ కొత్త పద్ధతిని ప్రయోగించడంలో ఈ పాఠశాలకే దక్కిందని చెప్పాలి. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీలకు పుస్తకాలు లేకుండా చెప్పే విధానంలో ఓ వింత సైతం దాగి ఉందని చెప్పడానికి యూకేజీ ఆఖరి రోజుల్లో ఆ చిన్నారులు ఆంగ్ల పత్రికలు సరళమైన పద్ధతిలో చదవి వినిపించడమే.. తరగతుల వారీగా ఉపాధ్యాయులు సోపానాలను వెయ్యడంతో అక్కడి చిన్నారులు విద్యార్థి దశను విజయాల దిశగా మలుచు కుంటున్నారు. జిల్లా స్థాయిలో ప్రారంభించి రాష్ట్రాలకు తమ పాఠశాల ఉనికి తీసుకెళ్లడంతో పాటుగా దేశ ప్రథమ పౌరుడితో ప్రశంసలందుకున్నారంటే వండర్స్ సృష్టిస్తున్న ఈ కిడ్స్ చేస్తున్న వండర్స్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేటికీ విజయవకాశాలను అందుకుంటున్న స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్‌ని ఓసారి చుట్టి వద్దాం పదండీ..!
స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్.. ఈ పదం పాఠశాల కంటే ప్రయోగశాలగానే అందరికీ సుపరిచితం. రికార్డులకు రుజువైన మార్గాన్ని చూపించే ఓ విద్యాలయంగా ఇప్పటికే వందలాది రికార్డులను కైవసం చేసుకొని ప్రథమ స్థానంలో నిలిచింది. స్నేహపూర్వక, ఉల్లాసభరితమైన వాతావరణంలో విద్యార్థుల బల, బలహీనతలను విశ్లేషించి అత్యుత్తమమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది ఈ స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్. తమ పిల్లలపై చేసిన ప్రయోగమే పాఠశాలని ప్రయోగశాలగా మార్చడానికి కారణమని డైరక్టర్ మళ్ల రామునాయుడు మాటల్లో పలుమార్లు వెల్లడిరచారు. తమ పెద్ద కుమార్తె రజితపై ఈ తరహా విద్యా విధానాన్ని ప్రయోగించడంతో 1996లో హెచ్‌ఆర్‌డీ మంత్రి ఎస్.ఆర్.బొమ్మై చేతుల మీదుగా జాతీయ బాలల అవార్డును ఆరేళ్ల ప్రాయంలో గెలుచుకున్నారంటే ఆయన చేసిన ప్రయోగ స్థాయికి వందలాది రికార్డులు అద్ధం పడుతున్నాయని చెప్పాలి. నాటి నుంచి ఆ మార్గంలో విద్యార్థులకు కొత్త కొత్త మెలుకువలు నేర్పిస్తూ విద్యావంతులుగా చేస్తున్నారు.
స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్‌లో విద్యార్థులకు విద్యను నేర్పించడం ఎంతటి బాధ్యతగా స్వీకరిస్తామో నైతిక విలువలకు సైతం ప్రాధాన్యత ఇచ్చే విధంగా విద్యార్థులను తయారుచేస్తాం. ఉపాధి సంపాధించడం కంటే సమాజంలో ఉత్తమంగా ఉండే విధంగా తయారు చేసి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో విద్యార్థులను నిలబెడతాం. ఒక రూపాయిని సక్రమమైన మార్గంలో సంపాధించడంతో పాటుగా ఆ రూపాయిని అదే మార్గంలో ఖర్చు చేసే విధానం సైతం నేర్పించడం మా ప్రత్యేకత. మారుతున్న కాలంలో తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను పూర్తి స్థాయిలో అరికట్టే విధంగా విద్యార్థులకు నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా చేస్తాం. – మళ్ల రామునాయుడు, వాణిశ్రీ (స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ డైరక్టర్, ప్రిన్సిపల్).