Please assign a menu to the primary menu location under menu

Tag Archives: Madhya Pradesh Hospital Fire

Crime

మధ్యప్రదేశ్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదంలో 8మంది మృతి

నేత్ర న్యూస్, భోపాల్: మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న జబల్‌పూర్‌ చీఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అఖిలేష్ గౌర్ తెలిపిన వివరాలు ప్రకారం.. జబల్‌పూర్‌లోని దామోహ్ నాకా ప్రాంతంలో గల న్యూ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించిందని పేర్కొన్నారు. తమకి వచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకునే సమయానికే భవనం నుంచి పెద్ద ఎత్తున పొగలు కమ్ముకొని భారీ అగ్నిప్రమాదం సంభవించిందని పేర్కొన్నారు. ప్రమాదంలో ఐదుగురు రోగులు, ముగ్గురు ఆసుపత్రి సిబ్బంది మృతి చెందినట్టు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. మరో 12మందికి పైగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.