Please assign a menu to the primary menu location under menu
Receive our editor's picks weekly
Receive our editor's picks weekly
నేత్రన్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి): బురుజుపేట శ్రీకనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం భక్తులకు కనువిందు చేసింది. మార్గశిర మాస మహోత్సవాల్లో రెండోవ గురువారం భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షలాధిగా తరలివచ్చారు. తొలి పూజతో ప్రారంభమైన విశేష పంచామృతాభిషేకాలు భక్తుల చేతుల మీదుగా అంగరంగ వైభవంగా కొనసాగాయి. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ క్రమేపి అధికమవ్వడంతో క్యూలైనుల్లో భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. సర్వదర్శనం క్యూలైనులో భక్తుల మధ్య చిన్నపాటి ఘర్షణలు సైతం చోటు చేసుకున్నాయి. కనకమ్మను దర్శించుకునేందుకు సూధూర ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకునే భక్తజనానికి ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకూడదని ఆలయ కార్యానిర్వాహక అధికారిణి చేసిన ఏర్పాట్లును ఓవైపు దేవాదాయశాఖ సిబ్బంది, మరోవైపు స్థానిక ఎమ్మెల్యే అనుచరులు, పోలీసులు బూడిదలో పోసిన పన్నీరు మాదిరి చేశారు. దీంతో ఎక్కడక్కడ క్యూలైన్‌ల్లో కుమ్ములాట జరిగింది. రూ.500 దర్శన మార్గంలో అడుగడుగున అక్రమ మార్గాలను ఏర్పాటు చేయడంతో ఎవ్వరికీ వారే హుందాతనాన్ని అనుభవిస్తూ క్యూలైన్‌లను తొలిగించి తమ అనుచర గణాన్ని దర్శనానికి తీసుకెళ్లడంతో రూ.500 టికెట్‌ని కొనుగోలు చేసిన భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపించింది. ఒకేసారి పదుల సంఖ్యలో పక్కదారి నుంచి పట్టుకుపోతున్న తీరుని సాధారణ భక్తులు జీర్ణించుకోలేక ఆసహనం వ్యక్తం చేశారు. ఆలయంలో చెదురుమదురు ఘటనలు ఎదురవ్వకూడదని ముందుగానే సూచనలు జారీ చేసిన నగర పోలీసు కమిషనర్ ఆదేశాలను సైతం దిగువ స్థాయి సిబ్బంది తుంగలో తొక్కి కద్దర్ చొక్కాలకు, బంధు ప్రీతికి లొంగిపోవడంతో అసలు సమస్య ఎదురైయిందని అమ్మవారి ఆలయంలో స్పష్టంగా కనిపిస్తుంది.