Please assign a menu to the primary menu location under menu
Receive our editor's picks weekly
Receive our editor's picks weekly
నేత్ర న్యూస్, విశాఖపట్నం, ( ప్రత్యేక ప్రతినిధి ): మత్తును కలిగించే మాదక ద్రవ్యాలు (డ్రగ్స్) వినియోగ, విక్రయాలతో పాటుగా అక్రమ రవాణా చేస్తున్నారని ఐదుగురు నిందితులను నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో శాంతి భద్రతల డీసీపీ-2 నిందితుల వివరాలతో పాటుగా నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సైకోట్రోపిక్ పదార్ధమైన ఎండీఎంఏని సైతం విలేకరుల సమావేశంలో చూపించారు. అనంతరం నిందితులను రిమాండ్‌కి తరలిస్తున్నామని చెప్పి అంతా చక్కగా ముగించగా.. అక్కడ నుంచే అసలు కథ ప్రారంభమైంది. ఓ స్టేషన్ స్థాయి అధికారితో పాటుగా తోటి సిబ్బంది సైతం ఉరుకులు పరుగులు మొదలయ్యాయని ఆ నోట.. ఈ నోట.. గుసగుసలు గుప్పుమన్నాయి. పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కి తరలించడానికి సిద్ధం చేసిన ఐదుగురు నిందితుల్లో ఒక నిందితుడు పరార్..? అయిపోయాడని, ఆ నిందితున్ని పట్టుకోవడానికి పోలీసు సిబ్బంది పరుగులు పెడుతున్నారని స్టేషన్‌కి మరొక కేసుల్లో వచ్చిన బాధితులు బహిరంగంగానే మాట్లాడుకున్నారు. ద్వారకానగర్ ప్రాంతంలో నివసిస్తున్న ఏ1 నిందితుడు సుంకర ప్రశాంత్(27), బెంగళూరు, కేజీ హల్లి ప్రాంతానికి చెందిన ఏ2 సయ్యద్ అజర్ అలీ(23), వన్‌టౌన్, రెల్లివీధికి చెందిన ఏ3 రత్నాల విష్ణు వర్ధన్(26), జగదాంబ, కుమ్మరి వీధిలో నివసిస్తున్న ఏ4 వజ్జల కరుణాకర్ అలీయాస్ కరుణా శాండీ(22), కలెక్టర్ కార్యాలయం సమీప అఫీషియల్ కాలనీలో నివసిస్తున్న ఏ5 గురజాపు వినాయక భాగ్య తేజ(27)ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు మూడో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో పట్టుకొని సంబంధిత స్టేషన్‌కి అప్పగించారు. దీంతో అక్కడ విధుల్లో ఉన్న అధికార యంత్రాంగం నిందితులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి రిమాండ్‌కి పంపించడంలో కాసంత పరాక్‌కుగా ఉండటంతో నిందితుల్లో ఓ నిందితుడు పరార్..? అయిపోయాడని విశ్వసనీయ సమాచారం అందింది. ఏ4 నిందితుడుగా ఉన్న వజ్జల కరుణాకర్ అలీయాస్ కరుణా శాండీ(22) మూత్రం వస్తుందని చెప్పి చక్కగా గోడదూకి పారిపోయాడని అక్కడి పరిచయ వ్యక్తుల నోట వినికిడి..