Please assign a menu to the primary menu location under menu

Weekly Gadgets

Find Us on Socials

Monday, July 15, 2024

Tag Archives: corporators

Political

ఆ నలుగురు..

 • విశాఖ దక్షిణంలో నలుగురు కార్పొరేటర్‌లు ఔట్‌..
 • ముందు నుంచి స్థానిక ఎమ్మెల్యేపై కస్సు బుస్సులు..
 • పార్టీ కేడర్‌ లేక దిక్కుతోచని స్థితిలో ఆ నలుగురు..
 • దక్షిణంలో వేడెక్కుతున్న రాజకీయ సమీకరణాలు..
 • అవకాశాన్ని అందుకోవడానికి సీతంరాజు ప్రయత్నం..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : విశాఖ దక్షిణంలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి మార్పులు సంతరించుకుంటున్నాయి. గత ఎన్నికల్లో నగరంలో నాలుగు దిక్కుల్లో టీడీపీ ఏర్పాటు చేసుకున్న స్థానాన్ని మరోమారు కైవసం చేసుకోవడానికి చూస్తుందని స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే తరుణంలో దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వాసుపల్లి గణేష్‌కుమార్‌ పార్టీ ఫిరాయింపు చేసి వైసీపీకి వెళ్ళినా ప్రస్తుత రాజీకీయ పరిణామాలతో దక్షిణం తిరిగి టీడీపీ కైవసం చేసుకుంటుందని బలంగా వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ-జనసేన కేడర్‌ బలంగా ఉన్న దక్షిణంలో ఎమ్మెల్యే ప్రజలను మోసగించి తన స్వార్థ ప్రయోజనాలతో పార్టీ మారిపోవడం చాలా మంది ప్రజల జీర్ణించుకోలేదనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేకి గట్టిగానే బుద్ధి చెప్పాలని దక్షిణ ప్రజలు ఎదురుచూస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఇదే క్రమంలో వార్డుల వారీగా పార్టీ కేడర్‌ని పెంచాల్సిన కార్పొరేటర్‌లు సైతం పార్టీలో డ్యాన్స్‌లు వేయడంతో వైసీపీ పార్టీపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుందనే చెప్పాలి. నియోజకవర్గంలో పోటీకి సిద్ధమై వార్డులో ప్రజలకు చీరలు, గడియారాలు, క్రీడ వస్తువులు పేరిట పంపిణీ కార్యాక్రమాలు చేయడంతో పాటుగా పలువురు కార్పొరేటర్‌లకు నల్ల కార్లు బహుమతిగా ఇచ్చి తనవైపు మలుచుకున్న బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ ఇప్పటికే పార్టీకి గుడ్‌బాయ్‌ చెప్పడం మరో ఉత్కంఠకి తెరతీసింది. అక్కడితో వదిలిపెట్టకుండా ప్రెస్‌మీట్‌లు పెట్టి పార్టీపై వ్యతిరేక గళం వినిపించడంతో పార్టీ పెద్దలు కన్నెర్ర చేయడం ప్రారంభించారు. ఈ తరుణంలో సీతంరాజుకి బజన చేసే కార్పొరేటర్‌ బృందంలో నలుగురు కార్పొరేటర్‌లను సైతం పార్టీ పక్కన పెట్టడం దక్షిణంలో రాజకీయం వేడి వేడిగా మారింది. నల్ల కార్లు తీసుకున్న మోజులో ముగ్గురు పక్కన ఉన్నా ఆ నలుగురు కార్పొరేటర్‌లు పైపైకి ఎగరడంతో పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని తెంపి పక్కన పడేసింది.

 • దూడకు కొమ్ములొస్తే ఊరుకుంటుందా(రా)..?
  దూడకు కొమ్ములొస్తే ఊరుకుంటుందా..? అది చూసిన యజమాని ఊరుకుంటాడా..? ఇదే పరిస్థితి విశాఖ దక్షిణంలో నెలకుంది. పార్టీ కేడర్‌తో కార్పొరేటర్‌లుగా గెలిచి తిరిగి పార్టీకే వ్యతిరేకంగా వ్యవహరిస్తే పార్టీ పెద్దలు ఊరుకుంటారా..? ఎట్టకేలకు పైపైకి ఎగురుతున్న దారాన్ని తెంపి పడేశారు. ‘పక్కనే ఉన్న వ్యక్తులను కాదని పార్టీ సీటులు ఇచ్చి.. పోటీ చేయడానికి నిధులు కేటాయిస్తే’ తిరిగి పార్టీనే వ్యతిరేకంగా చూపిస్తారా..? అని ఓ కీలక నాయకుడి నోట నుంచి వచ్చిన మాటతో రాజకీయం వేడెక్కిందనే చెప్పాలి. స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన విల్లూరి భాస్కర్‌రావు స్థానిక ఎమ్మెల్యేకి బజన చేసి పార్టీ తీర్థం పుచ్చుకొని వెంటనే ఆ ఎమ్మెల్యేకే పంగనామం పెట్టేశాడు. ఏ దిక్కు లేని దిక్కుమాలినోడ్ని తీసుకొచ్చి పార్టీ సీటు ఇచ్చి పార్టీ పెద్దలు గెలిపించుకుంటే.. మొదటి నుంచి పిచ్చి పిచ్చి చేష్టలతో వార్డు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత సంపాదించుకున్న బిపిన్‌ జైన్‌ సైతం వైసీపీకి వ్యతిరేకంగా ఉండటాన్ని పార్టీ సహించలేదు. ఇదే క్రమంలో మరో ఇద్దరు ఉరుకూటి నారాయణ, చెన్నా జానకిరామ్‌లకు సైతం దయతో సీటులు కేటాయించి, పెద్ద మొత్తంలో సొమ్మును ఖర్చు చేసి వైసీపీ కార్పొరేటర్‌లుగా గెలిపించుకుంటే మొదటిలో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా.. ఆఖరిలో అన్నం పెట్టిన పార్టీకే సున్నం రాసి వ్యతిరేకంగా వ్యవరించి ఆ నలుగురు తమ సీటులను చింపుకున్నారు.

 

 • నల్ల కార్లు మత్తులో పార్టీ కేడర్‌ పోయింది..!
  బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ ప్రారంభం నుంచి దక్షిణంలో చోటుని కైవసం చేసుకోవడానికి శత విధాలుగా ప్రయత్నిస్తున్న సమయంలో పార్టీ గుర్తించి నామినేటెడ్‌ పదవిని కేటాయించి పక్కన పెట్టినా ఆయన సంతృప్తి చెందలేదు. ఆ తరువాత మారోసారి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చి పోటీకి సిద్ధం చేసినా అక్కడ బలహీన పడి తిరిగి యదాస్థితికి చేరుకున్నారు. అదే జోరుతో ముందుగా కార్పొరేటర్‌లకు, కార్పొరేటర్‌లుగా పోటీలో ఉన్న అభ్యర్థులకు నల్లకార్లు కొనుక్కోమని డౌన్‌ పేమెంట్‌ సైతం ఇచ్చారని బలంగానే వినిపించాయి. దీంతో కార్లు కొనుగోలు చేసిన అందరూ సీతంరాజుకి బజన చేసి పార్టీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారని కేంద్ర కార్యాలయం నుంచి ఆ నలుగుర్ని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. కార్లు తీసుకొని బజన చేస్తున్న మరో ముగ్గురు కార్పొరేటర్‌లు, ఓడిన అభ్యర్థుల పరిస్థితి ఇంకా చూడాలి..!