Please assign a menu to the primary menu location under menu

GovernmentPolitical

జాతీయ జెండాను ప్రొఫైల్ చిత్రంగా ఉపయోగించాలని ప్రధానమంత్రి పిలుపు

నేత్ర న్యూస్, ఢిల్లీ: ఆగస్టు 2నుంచి 15వరకు సోషల్ మీడియా ప్రొఫైల్‌లలో “తిరంగ” (జాతీయ జెండా)ను తమ ప్రదర్శన చిత్రాలగా ఉంచాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం ప్రజలను కోరారు. తన ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసారంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 13 నుంచి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగ’ (ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం) పేరుతో ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. “మన ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయడం ద్వారా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళదామని ఆయన అన్నారు. ఈ సంవత్సరం స్వాతంత్ర్య 75వ వార్షికోత్సవానికి ముందు అనేక కార్యక్రమాలు, పథకాలతో జరుపుకున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ (స్వేచ్ఛా పండుగ)లో ఈ డ్రైవ్ ప్రజా ఉద్యమంగా మారుతోందని పీఎం చెప్పారు. దీంతో పాటుగా సోషల్ మీడియా ప్రొఫైల్-పిక్చర్ డ్రైవ్‌ను ఆగస్టు 2న ప్రారంభించడానికి కారణం మన జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య జన్మదినం కావడంతో ఆ తేదీని సూచిస్తున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి మోదీ “మేడమ్ కామా”ని కూడా ప్రస్తావించారు. దీని పూర్తి పేరు ‘భికైజీ రుస్తోమ్ కామా’ అని అన్నారు. జాతీయ జెండాకు ఆకృతి ఇవ్వడంలో కీలక పాత్ర పోషించారని, 1907 నుంచి ఆమె వెర్షన్‌లో మూడు రంగులు ఉన్నాయని అనేక సాంస్కృతిక, మతపరమైన చిహ్నాలు ఉన్నయని ప్రధాని మోదీ ప్రసంగంలో ప్రధానంగా స్వాతంత్య్ర వేడుకలపై దృష్టి సారించారని తెలుస్తుంది. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ మనమందరం ఒక అద్భుతమైన, చారిత్రాత్మక ఘట్టాన్ని చూడబోతున్నామని పేర్కొన్నారు.

RAVI KUMAR
the authorRAVI KUMAR

1 Comment

Leave a Reply