Please assign a menu to the primary menu location under menu
Receive our editor's picks weekly
Receive our editor's picks weekly
నేత్ర న్యూస్, విశాఖపట్నం : బాలల దినోత్సవం ప్రపంచ క్రీడా దినోత్సవాన్ని తలపించే విధంగా జరిగిందని ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంఈవోలు ఎం.సునిత, బి.పుష్య రాగం అన్నారు. మంగళవారం సాయంత్రం అక్కయ్యపాలెం, పోర్టు స్టేడియం, విశ్వనాథ్ కన్వెన్షన్స్‌లో స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ ఆధ్వర్యంలో జరిగిన రన ఫర్ ఫన్ కార్యక్రమంలో ఇరువురు ముఖ్య అతిథిలుగా పాల్గొని ఆనందంగా తిలకించారు. ఈ సందర్భంగా గాజువాక ఎంఈవో ఎం.సునిత మాట్లాడుతూ ప్రస్తుత విద్యా విధానంలో ఈ తరహా కార్యక్రమాలు చాలా అవసరమని అన్నారు. క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వలన మానసిక ఉల్లాసంతో చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఇదే విధంగా అన్ని పాఠశాలల్లో వారానికి రెండు రోజులు చిన్నారులకు క్రీడల వైపు మళ్ళించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహారాణిపేట ఎంఈవో బి.పుష్య రాగం మాట్లాడుతూ స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్‌లో వినూత్న రీతిలో చదివించడంతో పాటుగా క్రీడా పరమైన అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపించడం అభినందనీయమని అన్నారు. కరాటీ, డాన్స్, చెస్ వంటి క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి చిన్నారుల అభ్యున్నతికి పునాదులు వేస్తున్న పాఠశాలగా వండర్ కిడ్స్ నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరక్టర్ మళ్ల రామునాయుడు మాట్లాడుతూ బాలల దినోత్సవం అనేది బాలలు ఇష్టపడే విధంగా ఉండాలని, వాళ్ళ ఇష్టానుగుణంగా ఈ రన్ ఫర్ ఫన్ కార్యాక్రమాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ‘సరదా కోసం పరుగు’ పేరిట కార్యక్రమం నిర్వహించడం వలన చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని వివరించారు. అనంతరం చిన్నారులకు పలు రకాల క్రీడల్లో పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులతో పాటుగా పతకాలను అందించారు. కార్యక్రమంలో భాగంగా కేజీ విద్యార్థులు వేసిన నృత్యాలు అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. పలువురు విద్యార్థులు కరాటీ క్రీడలో చేసిన సాహసాలు అబ్బురపరిచాయి. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మరో ఇద్దరు ముఖ్య అతిథులు ఎంఈవోలు బి.పైడపునాయుడు, బి.విశ్వనాథం చిన్నారుల ప్రతిభకు మంత్రముగ్ధులై అభినందనల వెల్లువలు కురిపించారు. కార్యక్రమంలో రాష్ట్ర అపుస్మా మెంటర్ ఎ.కృష్ణారెడ్డి, కోశాధికారి ఎంవీ రావు, విశాఖ జిల్లా అపుస్మా అధ్యక్షులు ఎస్.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎంవీవీ సత్యనారాయణ, పాఠశాల ప్రిన్సిపల్ వాణిశ్రీ, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
నేత్రన్యూస్, స్పోర్ట్స్ : కామన్వెల్త్ గేమ్స్-2022లో నీతు గంఘాస్, అమిత్ పంగల్ భారత్‌కు రెండు బాక్సింగ్ స్వర్ణాలను అందించారు. బాక్సర్లు నీతూ గంఘాస్, అమిత్ పంఘల్ ఆదివారం జరిగిన పోటీల్లో భారత్‌కు రెండు స్వర్ణ పతకాలను అందించారు. ఫైనల్స్‌లో తమ ఇంగ్లీష్ ప్రత్యర్థులను చిత్తుగా ఓడించి మూడు రంగుల జెండా ఘనతను ప్రపంచానికి చాటి చెప్పారు.
బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల మినిమమ్ వెయిట్ విభాగం ఫైనల్‌లో ఇంగ్లండ్‌కు చెందిన డెమీ-జాడే రెజ్టన్‌ను ఓడించి బాక్సర్ నీతు గంఘాస్ ఆదివారం అద్భుతంగా ప్రదర్శించి భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించారు. న్యాయనిర్ణేతలందరూ ఏకగ్రీవంగా బౌట్‌ను ఆమెకు అనుకూలంగా నిర్ణయించడంతో నీతూ ఫుల్ ఫ్లోలో ఉంది. కొద్ది నిమిషాల తర్వాత ఏస్ బాక్సర్ అమిత్ పంగల్ పురుషుల 51కేజీల ఫైనల్‌లో ఆంగ్లేయుడు కియారన్ మక్‌డొనాల్డ్‌ను అధిగమించి తన మొదటి కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం సాధించాడు. ఈయన 2018లో రజతంతో సరిపెట్టుకున్నాడు.
గతంలో రెండు యూత్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ గోల్డ్ మెడల్స్ సాధించిన నీతూకి ఇది తొలి సీనియర్ పతకం. మరోవైపు పంగల్ గతంలో ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో రజతం కూడా సాధించాడు. ఈ పతకం టోక్యో ఒలింపిక్స్‌లో పతకం గెలుస్తుందని భావించిన పంఘల్‌లో పతనానికి గురైన తర్వాత అతని ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడానికి సహాయపడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పురుషుల ఫ్లైవెయిట్‌లో యూరోపియన్ ఛాంపియన్‌షిప్ రజత పతక విజేత ఇంగ్లండ్‌కు చెందిన కియారన్ మెక్‌డొనాల్డ్‌ను 5-0తో ఓడించి పంగల్ గత ఎడిషన్ నుండి తన రజతాన్ని మెరుగుపరుచుకున్నాడు. మరోవైపు, నీతూ 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతక విజేత ఇంగ్లండ్‌కు చెందిన డెమీ-జాడే రెజ్టన్‌ను 5-0 ఏకగ్రీవ తీర్పుతో అధిగమించింది.