Please assign a menu to the primary menu location under menu

Saturday, November 9, 2024

Photography

PhotographyTravel

ఏనుగులను దత్తత తీసుకున్న పోర్టు

నేత్రన్యూస్‌, విశాఖపట్నం: విశాఖపట్నం పోర్ట్‌ ట్రస్ట్‌ మరోసారి పెద్ద మనసు చాటుకుంది. నగరంలో గల ఇందిరా గాంధీ జంతు ప్రదర్శన శాలలో రెండు ఏనుగులను దత్తత తీసుకుంది. సీఎస్‌ఆర్‌ కార్యక్రమంలో భాగంగా రెండు ఏనుగులను ఒక ఏడాది కాలానికి దత్తత తీసుకున్నట్టు ప్రకటించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం ఉదయం మద్దిలపాలెం, స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓడరేవులు, షిప్పింగ్‌ జలమార్గల కేంద్ర మంత్రి శ్రీశంతను ఠాకూర్‌ చేతుల మీదుగా రూ.8.60లక్షల చెక్కును విశాఖపట్నం ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాల అసిస్టెంట్‌ క్యూరేటర్‌ ఉమా మహేశ్వరికీ అందించారు.