Please assign a menu to the primary menu location under menu
Receive our editor's picks weekly
Receive our editor's picks weekly
నేత్రన్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిథి): అధికారులు, అక్కడి నాయకుల పనితీరుతో ఓ వార్డులో అతిసారం రాజ్యమేలుతుంది. ఒక్కరోజులో పదుల సంఖ్యలో పెద్ద, చిన్న అనే వ్యత్యాసం లేకుండా సమీప ఆసుపత్ర్రులకు పరుగులు పెట్టడం స్థానికులను భయాందోళనకు గురి చేస్తుంది. గంట గంటకు రెండు నుంచి మూడు కేసులు పెరగడంతో ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి సుధూర ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఇప్పటికే సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసిన ఎటువంటి పలితం లేదని బోరుమంటున్నారు. 37వ వార్డు జబ్బరితోట ప్రాంతంలో రెండు రోజుల్లో సుమారు 15మందికి పైగా అతిసారం (డయేరియా) పంజాకు గురయ్యామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని నెలల తరబడి పెద్ద కుప్పగా మురుగుతున్న వ్యర్థాలను తొలిగించి వెళ్లినా అతిసారం తన తీరుని ఏ మాత్రం తగ్గించుకోలేదని కనిపిస్తుంది. స్థానిక శానిటరీ అధికారి, సిబ్బంది ఇటుగా పట్టించుకోకపోవడంతో స్థానికంగా ఉన్న స్మశానవాటిక గోడకు ఆనుకొని నెలల తరబడి మురుగుతున్న వ్యర్థాలతో పాటుగా యూజీడీ లైన్లు పొంగి పొరలడంతో మంచినీరు కలుషితమై డయేరియాకు గురవుతున్నట్టు పలువురు వైద్యుల వివరణతో స్థానికులు ఓ అంచనాకు వచ్చారు. ఇప్పటికే ఒక్కొక్కరిగా ఆసుపత్ర్రుల్లో ఐసీయూల బాట పట్టడంతో మిగిలిన ప్రజలు భయాందోళనలో మగ్గుతున్నారు. నీటి సరఫరా శాఖ అధికారులు, సిబ్బంది సైతం ఘటనా స్థలానికి చేరుకొని ఆ నీటిని తాము కూడా సేవించామని, ఎటువంటి సమస్య లేదని అక్కడ నుంచి నిష్క్రమించడంతో ఓ ఆలోచనలో పడ్డ ప్రజలు మరలా భయాందోళనలో పడినట్టు అయ్యింది.
– అతిసారం వలలో ఒకే ప్రాంత వాసులు ఎలా..?
ఎటువంటి నీటి కాలుష్యం జరగలేదని జీవీఎంసీ నీటి సరఫరా సిబ్బంది చెప్పిన సమాధానానికి అక్కడ ప్రజలందర్ని సందిగ్ధ్ధంలో పడేసింది. ఒక ఇంట్లో అందరికీ అతిసారం లక్షణాలు కనిపిస్తే ఆహార కలుషితం అయ్యిందని అనుకునే పరిస్థితులు అక్కడ లేకుండానే వార్డులో ఒకే ప్రాంతంలో ఉన్న సుమారు 15మందికి పైగా వ్యధి గ్రస్తులుగా మారండం అందర్నీ భయాందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికైనా సంబంధిత జీవీఎంసీ అధికారులు, నాయకులు ఘటనా స్థలానికిచేరుకొని అక్కడ ఏర్పడిన సమస్యపై ఓ వివరణ ఇస్తే మిగిలిన ప్రజలు ఊపిరి పీల్చుకునే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. స్థానికంగా వ్యర్థాలు సమస్యతో పాటుగా నీటి కలుషితం పైన కూడా దృష్టి కేంద్రికృతం చేయాలని పలువురు ప్రాథేయపడుతున్నారు.
నేత్ర న్యూస్, విశాఖపట్నం : మహిళలను గౌరవిచడం అందరి భాద్యతని, అదే బాధ్యతతో లోటస్ హాస్పిటల్స్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ జిల్లాలోని గర్భిణీలందరికీ ఫ్రీ డిజిటల్ మెంబర్షిప్ కార్డ్ అందించడం అభినందనీయమని పార్వతీపురం మన్యం జిల్లా దిశా డి.ఎస్.పి హర్షిత హరిచందన అన్నారు. ఈ సందర్బంగా ఆదివారం స్థానిక హోటల్లో లోటస్ హాస్పిటల్స్ ఫ్రీ మెంబర్షిప్ డిజిటల్ కార్డ్ ను ఆమె ముఖ్య అతిథిగా హాజరై విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళా మూర్తులని గౌరవిస్తూ ఒక ఏడాది పాటు రాయితీ కలిగిన ఫ్రీ డిజిటల్ మెంబర్షిప్ కార్డు అందించడం హర్షణీయమన్నారు. ఈ అవకాశాన్ని గర్భిణీ స్త్రీ లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మరొక అతిధిగా సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ వాణి మాట్లాడుతూ విశాఖలో ప్రప్రథమంగా ఇటువంటి ఫ్రీ డిజిటల్ కార్డు లోటస్ హాస్పటల్ ప్రెవేశపెట్టడం స్వాగతించదగిన విషయమన్నారు. ఈ ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఏడాది పాటు ఈ కార్డు వ్యాలిడిటీ కలిగి ఉంటుందన్నారు. ఈ కార్డు ద్వారా ఇన్వెస్టిగేషన్, కన్సల్టెంట్ కు 40% వరకు రాయితీ పొందవచ్చన్నారు. ప్రస్తుతం ప్రతి కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం భారంగా మారిందని, ఇటువంటి తరుణంలో లోటస్ ఆసుపత్రి డిస్కౌంట్ కార్డు అందించడం శుభపరిణామంగా పేర్కొన్నారు. ముఖ్యంగా గర్భిణీలకు ఈ కార్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఫ్రీ మెంబర్షిప్ కార్డు తీసుకునేందుకు ఫోన్ లో గాని, ఆసుపత్రి రిసెప్షన్ లో గాని సంప్రదించవచ్చని తెలియజేశారు. ఈ సమావేశంలో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళి సంతోష్, డాక్టర్ సంతోష్ కళ్యాణ్, గైనకాలజిస్ట్ లు డాక్టర్ దీప్తి, డాక్టర్ అవంతి, డాక్టర్ సౌఖ్య, అడ్మినిస్ట్రేషన్ ఇంచార్జ్ వెంకటేశ్వర్లు,మధు, పాల్గొన్నారు. సమావేశానికి ముందు హాస్పిటల్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డు లో మహిళల ఆరోగ్యం, భద్రతపై అవగాహన మారథాన్ నిర్వహించారు.
నేత్ర న్యూస్, కేరళ: కేరళలో కోతుల నుంచి సంభవించిన మొదటి మరణాన్ని భారతదేశం ధృవీకరించింది. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి రాష్ట్రానికి వచ్చిన 22ఏళ్ల యువకుడు శనివారం మరణించాడు. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ.. ఆ యువకునికి మొదట విదేశాలలో వైరస్ పాజిటివ్ అని తేలింది. ఆయన మరణం తర్వాత పరీక్షించిన శాంపిల్స్‌లో కూడా వైరస్ ఉన్నట్లు గుర్తించినట్లు మంత్రి తెలిపారు. ఈ మంకీపాక్స్ వచ్చిన వ్యక్తికి ఇరవై మందికి పైగా సన్నిహిత పరిచయాలు “హై రిస్క్” గా వర్గీకరించబడటంతో అందరూ ఒంటరిగా ఉన్నారని మంత్రి వివరించారు. అందులో అతని స్నేహితులు, కుటుంబం సభ్యులతో పాటుగా ఇటీవల ఫుట్‌బాల్ ఆడిన తొమ్మిది మంది వ్యక్తులున్నారని పేర్కొన్నారు.
మశూచి వంటి వైరస్‌ల కుటుంబానికి చెందిన మంకీపాక్స్ వైరస్ వల్ల ఈ అనారోగ్యం వస్తుంది తెలిపారు. అయితే ఇది చాలా తక్కువగా ఉంటుందని, ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశాలు తక్కువగ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ) గత నెలలో మంకీపాక్స్ వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిందని గుర్తు చేసారు. నాలుగో మంకీపాక్స్ కేసు తర్వాత భారత్ అప్రమత్తమైంది, కేరళలో వ్యక్తి మరణించిన తరువాత అతని వైద్య నివేదికలను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది ఎం. ఎస్. జార్జ్ చెప్పారు.
జులై 27న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినప్పుడు ఆ యువకుడికి జ్వరం, శోషరస గ్రంథులు వాపు ఉన్నాయని ఆయన ఆదివారం ఓ వార్తా వెబ్‌సైట్లో వెల్లడించారు. అయితే అతని శరీరంపై దద్దుర్లు లేవని, అతనికి కోతి వ్యాధి ఉన్నట్లు వైద్యులు అనుమానించడానికి కారణం కనిపించలేదని ఆమె చెప్పారు. అతను కేరళకు వెళ్లడానికి కొన్ని రోజుల ముందు జూలై 19న యుఎఇలో వైరస్ కోసం పాజిటివ్ పరీక్షించబడ్డాడని అయితే అతని కుటుంబం జూలై 30న మాత్రమే ఆరోగ్య అధికారులకు సమాచారం అందించారని మంత్రి తెలిపారు. అయినప్పటికీ అతని పరిస్థితి ఆసుపత్రిలో త్వరగా క్షీణించిందని, అతను చనిపోయే ముందు వెంటిలేటర్ పై ఉన్నాడు ఆమె తెలిపారు.
అతని నమూనాలను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా సోమవారం కోతి వ్యాధిని నిర్ధారించినట్లు ఆమె తెలిపారు. ఆ వ్యక్తి వైద్య సహాయం పొందడంలో ఎందుకు ఆలస్యం చేశాడనే దానిపై అధికారులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారని, అతనితో పాటుగా యూఏఈ నుంచి కేరళ వెళ్తున్న విమానంలో ఉన్న ప్రయాణికులు పరిస్థితిపై అప్రమత్తమయ్యారు. అయినప్పటికీ, వారు అతనితో సన్నిహితంగా లేనందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె వెల్లడించారు.
దేశంలో ఇప్పటి వరకు నాలుగు కోతుల వ్యాధి కేసులు నమోదయ్యాయని అందులో కేరళలో మూడు, రాజధాని ఢిల్లీలో ఒకటి నమోదు అయ్యాయని వివరించారు. జూలై 14న పాజిటివ్‌గా వచ్చిన మొదటి రోగి కేరళ రాజధాని తిరువనంతపురంలో చికిత్స పొందారని తెలిపారు.