Please assign a menu to the primary menu location under menu
Receive our editor's picks weekly
Receive our editor's picks weekly
నేత్ర న్యూస్, విశాఖపట్నం : బాలల దినోత్సవం ప్రపంచ క్రీడా దినోత్సవాన్ని తలపించే విధంగా జరిగిందని ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంఈవోలు ఎం.సునిత, బి.పుష్య రాగం అన్నారు. మంగళవారం సాయంత్రం అక్కయ్యపాలెం, పోర్టు స్టేడియం, విశ్వనాథ్ కన్వెన్షన్స్‌లో స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ ఆధ్వర్యంలో జరిగిన రన ఫర్ ఫన్ కార్యక్రమంలో ఇరువురు ముఖ్య అతిథిలుగా పాల్గొని ఆనందంగా తిలకించారు. ఈ సందర్భంగా గాజువాక ఎంఈవో ఎం.సునిత మాట్లాడుతూ ప్రస్తుత విద్యా విధానంలో ఈ తరహా కార్యక్రమాలు చాలా అవసరమని అన్నారు. క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వలన మానసిక ఉల్లాసంతో చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఇదే విధంగా అన్ని పాఠశాలల్లో వారానికి రెండు రోజులు చిన్నారులకు క్రీడల వైపు మళ్ళించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహారాణిపేట ఎంఈవో బి.పుష్య రాగం మాట్లాడుతూ స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్‌లో వినూత్న రీతిలో చదివించడంతో పాటుగా క్రీడా పరమైన అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపించడం అభినందనీయమని అన్నారు. కరాటీ, డాన్స్, చెస్ వంటి క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి చిన్నారుల అభ్యున్నతికి పునాదులు వేస్తున్న పాఠశాలగా వండర్ కిడ్స్ నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరక్టర్ మళ్ల రామునాయుడు మాట్లాడుతూ బాలల దినోత్సవం అనేది బాలలు ఇష్టపడే విధంగా ఉండాలని, వాళ్ళ ఇష్టానుగుణంగా ఈ రన్ ఫర్ ఫన్ కార్యాక్రమాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ‘సరదా కోసం పరుగు’ పేరిట కార్యక్రమం నిర్వహించడం వలన చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని వివరించారు. అనంతరం చిన్నారులకు పలు రకాల క్రీడల్లో పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులతో పాటుగా పతకాలను అందించారు. కార్యక్రమంలో భాగంగా కేజీ విద్యార్థులు వేసిన నృత్యాలు అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. పలువురు విద్యార్థులు కరాటీ క్రీడలో చేసిన సాహసాలు అబ్బురపరిచాయి. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మరో ఇద్దరు ముఖ్య అతిథులు ఎంఈవోలు బి.పైడపునాయుడు, బి.విశ్వనాథం చిన్నారుల ప్రతిభకు మంత్రముగ్ధులై అభినందనల వెల్లువలు కురిపించారు. కార్యక్రమంలో రాష్ట్ర అపుస్మా మెంటర్ ఎ.కృష్ణారెడ్డి, కోశాధికారి ఎంవీ రావు, విశాఖ జిల్లా అపుస్మా అధ్యక్షులు ఎస్.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎంవీవీ సత్యనారాయణ, పాఠశాల ప్రిన్సిపల్ వాణిశ్రీ, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
★ ఘనంగా ఉగాది సంబరాలు..
★ అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
★ జర్నలిస్టుల కుటుంబాలకు నూతన వస్త్రాల బహుకరణ..
★ జర్నలిస్టుల సేవలను కొనియాడిన ఏయూ విసీ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి..
నేత్ర న్యూస్, విశాఖపట్నం : సమాజాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని, వారు నవ సమాజ ప్రగతి సాధకులని ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్లు విశాఖపట్నం జిల్లా యూనిట్లు సంయుక్తంగా ఆదివారం ఏయూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అసెంబ్లీహాలులో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించాయి.
ఈ సందర్భంగా ప్రముఖ పండితులు కిరణ్ కృష్ణ పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యoతం అందరిని అలరించాయి. సంగీత కార్యక్రమాలతో పాటు క్లాసికల్ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో కేరింతలతో ఉత్సాహభరితంగా జర్నలిస్టుల కుటుంబాల ఆనందాల సవ్వడితో ఉగాది సంబరాలు అంబరాన్ని ఆంటాయి. అనంతరం జర్నలిస్టుల కుటుంబాలకు నూతన వస్త్రాలను బహూకరించారు.
ముఖ్య అతిథి ప్రొఫెసర్ పి.వి.జి.డి. ప్రసాదరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏయూ సమగ్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. సుమారు మూడు వేల మంది కి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఏయూ నిర్వహిస్తున్న వివిధ కోర్సులలో విద్యార్థుల శాతం పెంచడానికి అవసరమైన మౌలిక, బోధన సదుపాయాలు కల్పించడానికి చేస్తున్న కృషి వల్ల విద్యార్థుల శాతం గణనీయంగా పెరిగిందని తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థులకు అవసరమైన ఉద్యోగ, ఉపాధి రంగాలకు పనికి వచ్చే విధంగా నూతన కోర్సులను తీసుకొచ్చామని చెప్పారు. ప్రాధాన్యత కలిగిన కోర్సులను ఏయూ లో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా ఏయూ పరిసరాలను పరిశుభ్రంగా తయారు చేయడంతో పాటు విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని చెప్పారు. మొత్తం మూడు పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మెరైన్, ఫార్మసీ, ఫుడ్ ఆధారిత శిక్షణ సంస్థలు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఏయూ లో చదువుతున్న విద్యార్థులకు విద్యతో పాటు ఉద్యోగ కల్పన కోసం 79 కంపెనీలతో ఒప్పందాలు జరిగాయని తెలిపారు.
మే నాటికి సుమారు 400 కంపెనీలతో ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందన్నారు. ఏయూ అభివృద్ధిలో మీడియా సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు బయట ప్రపంచానికి తెలియజేయడానికి మీడియా రంగం కృషి చేయాలన్నారు.పంచాంగం పరిణామక్రమమే సైన్స్ అన్నారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, వైజాగ్ జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ సమాజ చైతన్యానికి జర్నలిస్టులు నాంది అన్నారు .ప్రభుత్వ సంక్షేమ పథకాలు విజయవంతంలో జర్నలిస్టుల కృషి ఎనలేనిది అన్నారు.ప్రజలకి ప్రభుత్వానికి మధ్య జర్నలిస్టులు వారిదిగా ఉంటూ సమస్యలను వెలుగులోకి తెస్తూ సమస్యలకు పరిష్కారం చూపుతూ చేస్తున్న సేవలు ఎనలేనివి అన్నారు. తెలుగువారికి ఉగాది ఒక ప్రత్యేక పండుగని, ఈ తెలుగు నూతన సంవత్సరంలో అందరూ ఆయూరోగ్యాలతో ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పోతుమహంతి నారాయణ్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఈ సంబరాలు వారిలో నూతన ఉత్సాహం కలిగిస్తాయన్నారు.ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు,ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు డి. రవికుమార్, ఎ. సాంబశివరావు, జాతీయ కౌన్సిల్ సభ్యులు జి. శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు ఎన్. రామకృష్ణ, కె. మురళీకృష్ణ, రంగాధామం, బొప్పన రమేష్, కోశాధికారి బి. సీతారామమూర్తి, సంయుక్త కార్యదర్సులు పి. కామన్న, ఇజ్రాయిల్, రమణమ్మ, ఎం. వి. రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీనియర్ జర్నలిస్టులను సన్మానించారు.
నేత్ర న్యూస్, విశాఖపట్నం: దండమూడి బాక్స్ఆఫీస్ పతాకంపై దండమూడి అవనీంద్ర కుమార్ నూతనంగా నిర్మించిన కథ వెనుక కథ చిత్రం యూనిట్ విశాఖలో ఆదివారం సందడి చేసింది. నగరంలోనీ ఓ హోటల్లో ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ స్ తో చిట్ చాట్ చేశారు. అనంతరం చిత్ర బృందం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గొట్టిపాటి సాయి మాట్లాడుతూ కథ వెనుక కథ చిత్రం ఈనెల 24న విడుదలకు సిద్ధమైంది అన్నారు. ఆద్యంతం అందరినీ ఆకట్టుకునే సస్పెన్స్ థ్రిల్లర్ గా దీన్ని రూపొందించమన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఈ సినిమాని తీర్చిదిద్దడం జరిగిందని గొట్టిపాటి సాయి పేర్కొన్నారు.
అనంతరం చిత్ర హీరో (ఓ పిట్టకథ ఫేమ్) విశ్వంత్ మాట్లాడుతూ తన కెరియర్లో ఈ చిత్రం ఒక మైలురాయిలుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇంతకుముందు ఎప్పుడు చెయ్యని ఒక వినూత్నమైన పాత్రను పోషించానన్నారు. అనంతరం ప్రముఖ కమెడియన్ మధు నందన్ మాట్లాడుతూ ఇప్పటివరకు ఎన్నో చిత్రాల్లో కమెడియన్ గా నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందాననిఅన్నారు. బాగా ఈ చిత్రంలో ఓ వైవిధ్యభరితమైన పాత్రను పోషించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో చిత్ర దర్శకుడు కృష్ణ చైతన్య ,హీరోయిన్లు శ్రీజిత ఘోష్, శుభశ్రీ తదితరులు పాల్గొని మాట్లాడుతూ ఈనెల 24న ప్రేక్షకులకు ముందుకి వస్తున్న తమను ఆదరించి, సినిమాను సక్సెస్ చేయాలని కోరారు.
– పోలమాంబ అమ్మవారి ఆలయంలో 1001 కొబ్బరికాయలతో ప్రత్యేక పూజలు..
– మానసిక వికలాంగుల పాఠశాలలో కేక్ కటింగ్..
– విమ్స్ లో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ..
నేత్ర న్యూస్, విశాఖపట్నం: జనసేన కొర్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్ద వాల్తేర్ కరక చెట్టు పొలమంబ అమ్మవారి దేవాలయంలో పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి 1001 కొబ్బరి కాయలు కొట్టి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ఉండాలని వేడుకున్నారు.
ఆదర్శ్ నగర్ హిడెన్ స్పోర్ట్స్ మానసిక వికలాంగుల పాఠశాలలో కేక్ కట్టింగ్ చేసి మానసిక వికలాంగుల చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం విమ్స్ హాస్పిటల్ లో రోగుల అందరికీ పండ్లు, రొట్టెలు, పానీయాలు పంపిణీ చేసి జనసైనికులు సంబరాల్లో మునిగి తేలారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పవర్ ఏంటో అధికార పార్టీకి చూపిస్తామన్నారు. ఆంధ్రలో ప్రతీ ఒక్కరూ పవన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరుగుతున్న పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ సంబరాలే దీనికి ఉదాహరణ అన్నారు. పవన్ అభిమానులు, జన సైనికులకు, ప్రజలు ఒక పండుగలా పవన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం రాష్టానికి కొత్త నాయకత్వాని ఆహ్వానించండమేనన్నారు. పవన్ జనాదరణకు అధికార, ప్రతిపక్ష పార్టీలు బయపడ్తున్నాయన్నారు. ఆయన పుట్టిన రోజున సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. కార్యక్రంలో పెద్ద ఎత్తున పాల్గున్న పవన్ అభిమానులు, మెగా అభిమానులు పాల్గున్నారు.
నేత్ర న్యూస్: తెలంగాణ మంత్రి కేటీఆర్ విసిరిన ఛాలెంజ్‌ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ యాక్సెప్ట్ చేశారు. ఇంతకీ ఏం ఛాలెంజ్ అనుకుంటున్నారా..? చేనేత ఛాలెంజ్.. ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత బట్టలు ధరించి ఆ ఫోటోలు లేదా వీడియోలు పోస్ట్ చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, పవన్ కళ్యాణ్, ఆనంద్ మహీంద్రాలకు మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో ఛాలెంజ్ విసిరారు. ట్విటర్‌లో ఈ ఆసక్తికర విషయం చోటుచేసుకోవడంతో ఒక వైపు పవన్ అభిమానులు మరో వైపు కేటీఆర్ అభిమానులు సంబ్రమాశ్చర్యంలో పడ్డారు.
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ #MyhandloomMyPride ఛాలెంజ్‌ను స్వీకరించి మరో ఇద్దరిలో మంత్రి కేటీఆర్‌ను నామినేట్ చేశారు. ఈ ఛాలెంజ్‌లో నామినీలు చేనేత దుస్తులు ధరించిన వారి చిత్రాలను పోస్ట్ చేయాలి.. అదే విధంగా చేయడానికి మరో ముగ్గురిని నామినేట్ చేయాలి. మంత్రి కేటీఆర్ సవాల్‌గా తీసుకుని సచిన్ టెండూల్కర్, ఆనంద్ మహీంద్రాతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను నామినేట్ చేశారు. కొన్ని గంటల్లో పవన్ కళ్యాణ్ ఛాలెంజ్‌ని స్వీకరించి, చేనేతలో ఉన్న తన చిత్రాలను పోస్ట్ చేశాడు.
ఇక్కడితో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చూశామనేలోపే పవన్ కళ్యాణ్ చేసిన ఛాలెంజ్ ఏపీలో రాజీకీయా అనుమానాలతో పాటుగా పొత్తుల టాపిక్ మల్లి బయట పడింది. ఆసక్తికరంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు వైసీపీ మాజీ మంత్రి బాలినేని వాసు, బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌లను ఆయన నామినేట్ చేశారు.
“@KTRTRS రామ్ భాయ్ యొక్క ఛాలెంజ్ ‘మా నేత కమ్యూనిటీల పట్ల నా ప్రేమ మరియు అభిమానానికి కారణం. ఇప్పుడు నేను శ్రీ @ncbn శ్రీ @balineni_vasu శ్రీ @drlaxmanbjpని నామినేట్ చేసాను. వారి చేనేతతో ఉన్న చిత్రాలను పోస్ట్ చేయడానికి, #NationalHandloomDayలో వారి ప్రేమను తెలియజేయాలని ”పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో రాశారు.
-నేత్రన్యూస్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి ఒక చారిత్రాత్మకా అంశంతో సినిమా చేస్తున్నారు. అనగానే అభిమానుల్లో తెలియని ఉత్సాహం నెలకొంది. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా రూపొందుతున్న ఈ సినిమాకి ఏఎం రత్నం నిర్మాతగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ గత కొద్దిరోజులుగా నిలిచి పోయింది. అయితే దీనికి కారణం క్రియేటివ్ డిఫరెన్సెస్ అని తెలుస్తోంది. హరిహర వీరమల్ల రషెష్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ సంతృప్తి చెందలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని మార్పులు చేర్పులు పవన్ కళ్యాణ్ క్రిష్ కి సూచించారని తెలుస్తోంది. హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్తగా ఒక యోధుడిగా కనిపించబోతున్నట్లు ఫస్ట్ లుక్కుతోనే ఒక క్లారిటీ ఇచ్చేశారు. అయితే మధ్యలో ఆ సినిమా మేకింగ్ విధానంలో మార్పులు చేయాలి అని పవన్ కళ్యాణ్ అప్సెట్ అయినట్లు అలాగే వెనుకడుగు వేసినట్లుగా టాక్ అయితే వచ్చింది.
అంతే కాకుండా సినిమా షూటింగ్ కూడా మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉందని నిర్మాత ఆర్థిక పరిస్థితుల వలన కూడా పూర్తి కాకపోవచ్చు అని రూమర్స్ కూడా వచ్చాయి. కానీ ప్రస్తుతం చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఎప్పటిలానే షూటింగ్ పనుల్లో బిజీ అయిపోయారు. పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ ఎంతో సినిమా అవుట్ ఫుట్ పై నమ్మకంగా ఉన్నారని సినిమా తప్పకుండా అనుకున్న సమయానికి విడుదల చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన విడుదల చేయాలని కూడా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి అది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొంతకాలం ఆగాల్సిందే. అలాగే పవన్ పుట్టినరోజు సందర్భంగా హరీష్ శంకర్ సినిమా అప్డేట్ కూడా రావచ్చని టాక్ వస్తోంది.