Please assign a menu to the primary menu location under menu

Weekly Gadgets

Find Us on Socials

DevotionalPolitical

కనకమ్మ ఆలయంలో పైరవీల పర్వం

  • బురుజుపేట కనకమ్మ ఆలయంలో తీవ్ర ఇబ్బందులకు గురైన భక్తులు..
  • స్థానిక ఎమ్మెల్యే అనుచరుల చేష్టలకు చిర్రెత్తి పోయిన భక్త జనం..
  • ఆలయంలో భజన బృందాన్ని తలపించిన పోలీసు బృందాలు..
  • సమిష్టి కృషితో అమ్మవారి ఆదాయాన్ని లక్షల్లో గండికొట్టిన వైనం..

నేత్రన్యూస్‌, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి): బురుజుపేట శ్రీకనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం భక్తులకు కనువిందు చేసింది. మార్గశిర మాస మహోత్సవాల్లో రెండోవ గురువారం భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షలాధిగా తరలివచ్చారు. తొలి పూజతో ప్రారంభమైన విశేష పంచామృతాభిషేకాలు భక్తుల చేతుల మీదుగా అంగరంగ వైభవంగా కొనసాగాయి. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ క్రమేపి అధికమవ్వడంతో క్యూలైనుల్లో భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. సర్వదర్శనం క్యూలైనులో భక్తుల మధ్య చిన్నపాటి ఘర్షణలు సైతం చోటు చేసుకున్నాయి. కనకమ్మను దర్శించుకునేందుకు సూధూర ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకునే భక్తజనానికి ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకూడదని ఆలయ కార్యానిర్వాహక అధికారిణి చేసిన ఏర్పాట్లును ఓవైపు దేవాదాయశాఖ సిబ్బంది, మరోవైపు స్థానిక ఎమ్మెల్యే అనుచరులు, పోలీసులు బూడిదలో పోసిన పన్నీరు మాదిరి చేశారు. దీంతో ఎక్కడక్కడ క్యూలైన్‌ల్లో కుమ్ములాట జరిగింది. రూ.500 దర్శన మార్గంలో అడుగడుగున అక్రమ మార్గాలను ఏర్పాటు చేయడంతో ఎవ్వరికీ వారే హుందాతనాన్ని అనుభవిస్తూ క్యూలైన్‌లను తొలిగించి తమ అనుచర గణాన్ని దర్శనానికి తీసుకెళ్లడంతో రూ.500 టికెట్‌ని కొనుగోలు చేసిన భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపించింది. ఒకేసారి పదుల సంఖ్యలో పక్కదారి నుంచి పట్టుకుపోతున్న తీరుని సాధారణ భక్తులు జీర్ణించుకోలేక ఆసహనం వ్యక్తం చేశారు. ఆలయంలో చెదురుమదురు ఘటనలు ఎదురవ్వకూడదని ముందుగానే సూచనలు జారీ చేసిన నగర పోలీసు కమిషనర్‌ ఆదేశాలను సైతం దిగువ స్థాయి సిబ్బంది తుంగలో తొక్కి కద్దర్‌ చొక్కాలకు, బంధు ప్రీతికి లొంగిపోవడంతో అసలు సమస్య ఎదురైయిందని అమ్మవారి ఆలయంలో స్పష్టంగా కనిపిస్తుంది.

  • ఎమ్మెల్యే పేరుని ఆయన అనుచరులే దిగజార్చారు..!
    • ఆలయంలో రద్ధీ పెరుగుతున్న సమయంలో స్థానిక ఎమ్మెల్యే అమ్మవారి దర్శనం చేసుకోవడానికి రావడంతో అదును చూసుకొని ఆయన అనుచరులు దౌర్జన్యంగా ప్రవర్తించారు. గత వారం మాదిరిగానే ఈ గురువారం కూడా గుంపులు గుంపులుగా వాళ్ల బంధువులను, చోటా మోటాలను అక్రమ మార్గంలో దర్శనానికి తీసుకెళ్లడంతో సుధూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అక్కడ ఉద్యోగంలో ఉన్న దేవాదాయశాఖ సిబ్బంది అయితే రాజకీయ పలుకుబడికి భయపడుతూ నిమ్మకుండిపోయారు. ఇక పోలీసు సిబ్బంది అయితే భజన బృందాన్ని తలపించే విధంగా ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి సంరక్షణలో దిగువ స్థాయి సిబ్బంది సైతం అక్రమ మార్గంలో వచ్చే అనుచర వర్గానికి వత్తాసు పలకడం గమనార్హం.
  • సేవ ముసుగులో అమ్మవారి ఆదాయం లక్షల్లో గండి కొట్టారు..!
    • అమ్మవారి మార్గశిర మహోత్సంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా దేవాదాయ దర్మదాయ శాఖ సిబ్బందితో పాటుగా పలు సేవా సంస్థలను ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు వారిపై అటుగా పర్యావేక్షణ లేకపోవడంతో అమ్మవారి ఆదాయానికి గండి పడిరది. సేవా సంస్థలు పదుల సంఖ్యలో సేవ చేయడానికి సిబ్బందిని ఆలయంలో నియమిస్తే వేలాది మంది సేవా వస్త్రాలతో, మెడలో గుర్తింపు కార్డులతో రూ.500 దర్శన క్యూలైనుల్లో హల్‌చల్‌ చేశారు. సేవ చేయడానికి లోపలికి వెళ్తున్నామని అమ్మవారి దర్శనానికి దర్జాగా వెళ్లి అమ్మవారి ఆదాయానికి గండి కొట్టారు. దీనికి తోడుగా ఆలయ దిగువ స్థాయి అధికారులు, సిబ్బంది బంధు ప్రీతితో చేసిన చేష్టలు సాధారణ భక్తుల దర్శనానికి చాలా సమయం పట్టి చెమటలు పట్టించాయి. ఇదే మార్గంలో పోలీసు వర్గం దేవాదాయ శాఖ సిబ్బందితో పోటి పడుతూ క్యూలైనుల్లో తమ శైలి చూపించడంతో అమ్మవారి ఆదాయం రూ.లక్షల్లో గండి కొట్టినట్టు ఇట్టే అర్థం అయిపోతుంది.
  • క్యూలైన్‌లు ఏర్పాటు చేయడంలో లోపాలు కనపిస్తున్నాయి..
    • అధిక సంఖ్యలో ఆలయానికి భక్తులు వస్తున్న క్రమంలో సంబంధిత అధికారులు తీసుకున్న జాగ్రత్తలు మరింత ఇబ్బందులకు గురిచేశాయి. ఈ ఏడాది కొత్త ఆలయ కార్యానిర్వాహక అధికారిణికి అన్ని అంశాలు వివరిస్తూ నిర్మించాల్సిన క్యూలైన్‌ల్లో చాలా అక్రమ మార్గాలు ఏర్పాటు చేయడం మరింత ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో సాధారణ భక్తులతో పాటుగా రూ.500 టికెట్‌ తీసుకున్న భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎటువంటి టికెట్‌ తియ్యకుండా వచ్చే చొరబాటుదారులు మాత్రం రాజభోగంతో అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారని పలువురు భక్తులు తీవ్రంగా మండి పడుతున్నారు.

RAVI KUMAR
the authorRAVI KUMAR

Leave a Reply