NETRA NEWS > Government > బియ్యం దొంగలు-2
- సర్కిల్-1 ఎండీయూ సిబ్బంది చేతుల్లో వేల టన్నుల బియ్యం మాయం..
- వీఆర్‌వోల సమక్షంలో లావాదేవీలను చర్చించుకుంటున్న గజ దొంగలు..
- ఆర్‌ఐల అండదండలతో దారితప్పుతున్న నాణ్యమైన సర్కారు సన్న బియ్యం..
- అల్లిపురం సమీప ప్రాంతాల్లో వేల టన్నుల సరుకుని మిల్లులకు తరలింపు..
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉచితంగా అందింస్తున్న కోటా బియ్యం పేదలకు అందకుండానే ఆమడ దూరంలో ఉన్న మిల్లులకు రూ.కోట్ల రూపాయిలకు వెళ్లిపోతున్నాయి. ఉచితంగా ఇచ్చే బియ్యంతో ఉపయోగం లేదని పేదలు రూ.10చొప్పున విక్రయాలు చేస్తున్న విషయం తెలిసి కూడా వారికి అవగాహన పరచకుండా సంబంధిత వీఆర్‌వోలు, పౌరసరఫరాలశాఖ ఆర్‌ఐలు అటుగా పట్టించుకోకపోవడంపై పలువురు నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. నెలవారీ మామ్మూళ్లుతో పాటుగా దాడులు చేయడానికి వస్తున్నామని డీలర్‌కి ముందస్తు సమాచారం అందించడంతో వచ్చే ఆమ్యామ్యాలకు అలవాటు పడిన సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించడంలో అలసత్వం చూపిస్తున్నారని సంబంధిత ఉన్నతాధికారులే పలుమార్లు హెచ్చిరించినట్టు సమాచారం. విశాఖ అర్బన్ జిల్లాలో గల అన్ని సర్కిల్స్ కంటే సర్కిల్-1లో అధిక మొత్తంలో రేషన్ బియ్యం పక్కదారి పడుతుందనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. సంబంధిత సర్కిల్ పరిధిలో ఉన్న జిల్లా పౌరసరఫరాల శాఖ సిబ్బందితో డీలర్లకు, ఎండీయూ (మొబైల్ పంపిణీ యూనిట్)ల సిబ్బందికి పరిచయాలు అధికంగా ఉండటంతో ఆడిరదే ఆట.. పాడిరదే పాట..గా మారి జోరుగా అక్రమ విక్రయాలు చేస్తున్నారని పలువురు దొంగ వ్యాపారులే అనుకుంటున్నారు. దీనిపై ఇప్పటికైన జిల్లా యంత్రాంగంలో పెద్ద అధికారులు పట్టించుకుంటారో లేదా వేచి చూడాలి.
- కోటా బియ్యానికి కొత్త కొత్త రూపాలు వస్తున్నాయి..!
పేదలకు అందించే కోటా బియ్యం కొత్త కొత్త రూపాల్లో పక్కదారి పట్టి రూ.కోట్ల రూపాయిలుగా మార్పు చెందడం విశాఖలో స్పష్టంగా గమనించవచ్చు. ఎండీయూల ద్వారా కొనుగోలు జరిగిన బియ్యం పక్కదారి పట్టడానికి చౌకధర దుకాణాల్లోనే కొత్త రూపంలో మార్పు చెందడం జరుగుతుంది. ఓ వ్యాపారి నలుపు రంగు సంచుల్లో బియ్యాన్ని తరలిస్తుంటే.. మరో వ్యాపారి పండ్ల బాస్కెట్‌లో తరలిస్తున్నారు. ఓ వ్యాపారి ద్విచక్ర వాహనంపై రెండేసి బస్తాల చొప్పున తరలిస్తుంటే.. మరో వ్యాపారి దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త రకం బియ్యం బ్రాండ్ పేరుతో ఒకే రకమైన బియ్యం సంచులను ముద్రించి అందులో రేషన్ బియ్యాన్ని ప్యాకింగ్ చేసి అధిక ధర కలిగిన బియ్యం బస్తాల రూపంలో దర్జాగా పక్కదారి పట్టిస్తున్నాడంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలా నగరంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన బియ్యం దొంగలు నెలలో మొదటి 10రోజులు తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో వేల టన్నుల కోటా బియ్యాన్ని ఆమడ దూరంలో ఉన్న రైస్ మిల్లులకు తరలిస్తున్నారు.
- అందరికీ తెలిసే అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయి..!
ప్రభుత్వం నుంచి పేదలకు అందించాల్సిన కోటా బియ్యాన్ని డీలర్లు తింటున్నారని, ఇక నుంచి నేరుగా పేదల ఇంటికే బియ్యం చేరాలని వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం పక్కదారి పట్టింది. మొబైల్ పంపిణీ యూనిట్ (ఎండీయూ)ల ద్వారా బియ్యం పేదలకు చేరుతాయని ప్రభుత్వం వేసిన అంచనాలు తారుమారు అయ్యాయి. డీలర్ల కంటే రెండిరతలు అధిక మొత్తంలో ఈ ఎండీయూలు కోటా బియ్యం కొనుగోలు చేసి డీలర్ల సహకారంతో అధిక మొత్తానికి విక్రయిస్తున్న ఘటనలు వందల సంఖ్యలో ఆధారాలతో పాటుగా పట్టుబడిన సంబంధిత జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవస్థలో లోపాలు ఉంటే ఆ పక్కనే ఉన్న పోలీసు వ్యవస్థ దానికి అనుబంధంగా ఉండే టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ వ్యవస్థల్లో సైతం సిబ్బంది నెలవారీ వచ్చే మామ్మూళ్లుకు కక్కుర్తి పడి పేదల బియ్యం అక్రమ మార్గంలో పక్కదారి పడుతున్నా పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- రెండు నెలలు పరుగులు పెడతారు అంతే..!
రేషన్ బియ్యం అక్రమ మార్గంలో విక్రయిస్తున్నామని అందరికీ తెలుసు..! మా వ్యాపారంలో వచ్చే రూపాయిలో అందరికీ సగం మొత్తం పంపిణీ చేస్తాం. అందుకోసమే జిల్లా అధికారి హెచ్చరికలు జారీ చేస్తే దిగువ స్థాయి అధికారులు రెండు నెలలు పరుగులు పెట్టి ఒకరిద్దరు అమాయకపు వ్యాపారులను బలి చేస్తారు. తరువాత ఎప్పటిలాగే వ్యాపారం చేసుకుంటాం. పట్టుకోవడం ఓ నాటకం.. వదిలిపెట్టడం ఒక నాటకం.. ఎవ్వరైనా ఉన్నతాధికారి తమపై ఒత్తిడి చేస్తే ఆ నాటకానికి పెట్టే కొత్త పేరు ‘అక్రమ వ్యాపారి అరెస్ట్’ అని పేరు మార్చి కొత్త కథ రాస్తారు. అంతే కానీ మా వ్యాపారంలో ఇటువంటి అవినీతి అధికారులు ఉన్నంత వరకు ఎటువంటి డోకా లేదు. ఎప్పటిలాగే ఎండీయూ నుంచి డీలర్‌కి.. డీలర్ నుంచి దళారికి.. దళారి నుంచి మిల్లు వ్యాపారికి ప్రభుత్వ కోటా బియ్యం చేరుతునే ఉంటాయి. – ఓ వ్యాపారి (కోటా బియ్యం కొనుగోలు చేసే వ్యక్తి).
NETRA NEWS
All posts byNETRA NEWS
You Might Also Like
ఆ నలుగురు..
January 19, 2024
ఉత్సాహంగా రన్ ఫర్ ఫన్
November 15, 2023
బియ్యం దొంగలు
November 3, 2023
అధికారుల అండతో చీకటి వ్యాపారం
June 2, 2023