NETRA NEWS > Government > అధికారుల అండతో చీకటి వ్యాపారం
- పౌర సరఫరా శాఖ సమక్షంలో పీడీఎస్ గోల్.. మాల్..
- రేషన్ బియ్యం అక్రమ విక్రయాల్లో చేదోడు వాదోడు..
- చూసి చూడ నందుకు నెలవారీ మామ్మూళ్లు..
నేత్ర న్యూస్, విశాఖపట్నం, (ప్రత్యేక ప్రతినిధి) : పేద ప్రజలకు అందించాల్సిన పీడీఎస్ రైస్ పక్కదారి పట్టడానికి ప్రభుత్వ అధికారులే కీలకంగా వ్యవరిస్తున్నారని ఒకటి రెండు ఘటనలు పరిశీలిస్తే ఇట్టే అర్థం అయిపోతుంది. నెల చివరిలో వచ్చే జీతాలు కంటే నెలవారీ వస్తున్న మామ్మూళ్లు మత్తులో అధికారులు విధులు నిర్వహించడంతో పేదల బియ్యం పక్కదారి పడుతుంది. పీడీఎస్ రైస్‌ని అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందుకున్న అధికారులు అందినకాడికి దోచుకోని వదిలేయడంతో ఓ ఫిర్యాదు దారుడు జిల్లా అధికారికి సైతం ఫిర్యాదు అందించడానికి సిద్ధమయ్యాడంటే దిగువ స్థాయిలో సిబ్బంది చేస్తున్న చేష్టలు హద్దులు మీరుతున్నాయనే చెప్పాలి. గురువారం రాత్రి సుమారు10.50గంటల సమయంలో అరిశెట్టి మహేశ్వరరావు అనే వ్యాపారి అల్లిపురం బజారు ప్రాంతంలో 750కేజీల పీడీఎస్ రైస్‌ని ఆటోలో అక్రమంగా తరలిస్తున్న సమాచారం అందుకున్న ఓ సర్కిల్-1 ఆర్‌ఐ రూ.20వేలు లంచం తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే క్రమంలో సర్కిల్-3 పరిధిలో విధులు నిర్వహిస్తున్న మరో ఆర్‌ఐ ఓ పీడీఎస్ రైస్ వ్యాపారిపై దాడులు నిర్వహించి రూ.15వేలు, ఓ మిల్లు యజమాని నుంచి ఇంకొక ఆర్‌ఐ రూ.15వేలు తీసుకోవడం అధికారుల పనితీరు కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనే చెప్పాలి.
- ఉన్నతాధికారుల నిఘా నీరు కారిపోతుంది..
సర్కిల్ పరిధిలో డిఫోలు, ఎండీయూల నుంచి పీడీఎస్ రైస్ పక్కదారి పడుతుందని రోజువారీ వందల ఫిర్యాదులు వస్తున్నా అటుగా పట్టించుకోవడంలో ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహించడంతో దిగువ స్థాయిలో ఉన్న వీఆర్‌వోలు, ఆర్‌లు దండీగా దండుకుంటున్నారని సమాచారం. నెల చివరిలో వచ్చే జీతాల కంటే నెలవారీ వచ్చే మామ్మూళ్లుపై మక్కువ పెంచుకొని విధులు నిర్వహించడంతో అక్రమ విక్రయాలపై దృష్టి కేంద్ర్రీకృతం చేయలేకపోతున్నారని బహిరంగ రహస్యం. రోజువారీ సమీక్షలు నిర్వహించి దండిరచాల్సిన ఉన్నతాధికారులు సైతం చోద్యం చూడటంతో నిఘా నీరు కారిపోతుంది.
- పీడీఎస్ అక్రమ విక్రయాలతో దండీగా దుడ్లు..
పేదల బియ్యాన్ని పేదవాడికి అందించకుండా మిల్లులకు అక్రమంగా తరలించడంలో పౌర సరఫరా శాఖ సిబ్బంది, వార్డు సచివాలయ రెవెన్యూ కార్యదర్శిలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. రోజువారీ దాడుల పేరిట పీడీఎస్ వ్యాపారులు, డిఫో డీలర్లు, ఎండీయూల నుంచి అందినకాడికి దోచుకోవడంలో సిద్ధ హస్తులుగా నిలుస్తున్నారు. ఎఫ్‌సీఐ గిడ్డంగుల నుంచి వచ్చే బియ్యం పేదవాడికి అందకుండా శివారు ప్రాంతాల్లో ఉన్న మిల్లులకు తరలించే ప్రక్రియలో కీలకంగా వ్యవహరిస్తున్న సిబ్బంది దండీగా దుడ్లు సంపాధిస్తున్నారని ఆనోట.. ఈనోట.. గట్టిగానే వినిపిస్తుంది.
- నెలలో పదిరోజులు పండగ చేసుకుంటున్నారు..
ప్రతీ నెలలో మొదటి పది రోజులు పీడీఎస్ రైస్‌ని అక్రమంగ విక్రయాలు చేస్తున్న వ్యాపారులు పండగ చేసుకుంటున్నారు. గిడ్డంగుల నుంచి రేషన్ డిపోలకు తరలించిన బియ్యం డిపోల్లో కొత్త ప్యాకింగ్‌లతో సిద్ధమై దర్జాగా మిల్లులకు ప్రయాణమవుతున్నాయంటే వ్యవస్థలో లోపాలు ఏవిధంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనిపై పూర్తిగా అవగాహన ఉన్న అధికారులు సైతం ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదని పలువురు పేద ప్రజలే ప్రశ్నిస్తున్నారు.
NETRA NEWS
All posts byNETRA NEWS
You Might Also Like
బియ్యం దొంగలు-2
December 2, 2023
ఉత్సాహంగా రన్ ఫర్ ఫన్
November 15, 2023
బియ్యం దొంగలు
November 3, 2023
అభివృద్ధి పనులు పరిశీలించిన ఆదిమూలపు
March 25, 2023