Please assign a menu to the primary menu location under menu

Weekly Gadgets

Find Us on Socials

Monday, September 9, 2024
Uncategorized

తునికలు కొలతల్లోనే లోపాలు..!

  • చిరు వ్యాపారుల నుంచి ఇష్టానుసారం వసూళ్లకు పాల్పడుతున్న మెట్రాలజీ సిబ్బంది..
  •  జరిమానా రశీదుకు రెండిరతలు కాజేస్తున్న విశాఖ తూనికలు కొలతల శాఖ సిబ్బంది..
  •  ఏఎంసీ పేరిట నకిలీ సంస్థలతో చేతులు కలిపి ఒక్కొక్క దుకాణం నుంచి రూ.వేలల్లో డిమాండ్‌..
  •  ఓ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి సైతం ఏఎంసీ సొమ్ము పేరిట రూ.వెయ్యి అదనంగా వసూళ్లు..
  •  జరిమానా చెల్లించలేదని కాటాలను వాహనంలో తీసుకుపోయిన లీగల్‌ మెట్రాలజీ సిబ్బంది..
  • ప్రైవేటు సంస్థల నుంచి నెల మామ్మూళ్లు పేరిట రూ.లక్షల్లో దోచుకుంటున్న యంత్రాంగం..
  •  లీగల్‌ మెట్రాలజీ సిబ్బంది చేష్టలను అటుగా పట్టించుకోని అవినీతి నిరోధక శాఖ..

నేత్ర న్యూస్‌, విశాఖపట్నం : బయట ప్రపంచానికి కనిపించకుండా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ యంత్రాంగాల్లో ఒకటైన లీగల్‌ మెట్రాలజీ శాఖ (తూనికలు కొలతలు) విభాగం చేస్తున్న చేష్టలకు చిరు వ్యాపారులు బోరుమంటున్నారు. ఏడాదికి ఓమారు తనిఖీల పేరిట చిరు దుకాణాలు, తోపుడు బండ్లు వద్దకు వచ్చిన లీగల్‌ మెట్రాలజీ అధికార సిబ్బంది చేసే హడావుడితో వ్యాపారులు హడలెత్తిపోతున్నారనే చెప్పాలి. జీవోలో ముద్రించిన విధంగానే జరిమానాలు వసూళ్లు చేస్తున్నామని చెప్పిన అధికారులు ఇచ్చిన రశీదు కంటే అదనంగా వసూళ్లు చేస్తున్న సొమ్మును ఏ లెక్కల్లో చూపిస్తారో వాళ్లకే తెలియాలి. పెద్ద పెద్ద మార్కెట్‌లు, షాపింగ్‌ మాల్స్‌, పెద్ద డిపార్టుమెంటెల్‌ స్టోర్స్‌ నుంచి ఏడాది ఓమారు అప్పనంగా వచ్చే మామ్మూళ్లు మత్తులో అటుగా తనిఖీలు చేయని లీగల్‌ మెట్రాలజీ విభాగ సిబ్బంది రహదారులపై కాయగూరలు, పండ్లు అమ్ముకునే చిరు వ్యాపారులపై ఒక్కసారిగా పడి అందినకాడికి దోచుకుంటున్నారని పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయం నుంచి ఏడాదికి ఓమారు దుకాణాల వద్దకు వచ్చి కాటాలకు వేసిన ముద్రణలతో కూడుకున్న సీల్స్‌ను మార్చాల్సిన సిబ్బంది అటుగా కనిపించకపోవడంతో ప్రైవేటు వ్యక్తులు రాజ్యమేలుతున్నారని ఆరోపిస్తున్నారు. కేజీలకు అనువుగా ఒక్కొక్క కాటాకు ఓ మొత్తంలో తీసుకోవల్సిన ప్రైవేటు వ్యక్తులు సైతం అదనంగా రూ.2వేల నుంచి రూ.3వేలు డిమాండ్‌ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారని వెల్లడిస్తున్నారు. దీనిపై సంబంధిత ప్రైవేటు వ్యక్తులను వివరణ కోరగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానాతో పాటుగా ప్రభుత్వ అధికారులకు చెల్లిస్తున్న చిల్లర సొమ్ము కలుపుతూ అదనంగా వసూలు చేస్తున్నామని వెల్లడిస్తున్నారు. భారీ మొత్తంలో సొమ్మును చెల్లించలేమని బాధితులు బోరుమంటే సంబంధిత సిబ్బందిని దుకాణాల మీదకు ఎక్కించే ఘనమైన ఘనత కూడా వాళ్ల సొంతం. ఏడాదికి ఓసారి వచ్చి అడిగిన సొమ్మును చెల్లించకపోతే జరిమానా విధించి కాటాలను తీసుకెళ్లిపోతామని పలుమార్లు ప్రైవేటు వ్యక్తులే బెధిరింపులకు పాల్పడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

 

  • భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్న లీగల్‌ మెట్రాలజీ సిబ్బంది..
    వస్తు కొనుగోలు సమయంలో వ్యాపారుల నుంచి వినియోగదారులు మోసపోకుండా చూడాల్సిన యంత్రాంగమే మొదటిగా వ్యాపారులను తద్వారా వినియోగదారులను మోసం చేస్తున్న ఘటనలు విశాఖ నగరంలో కోకొల్లలు. కాటాలకు సీల్స్‌ పేరిట ఏడాదికి ఓమారు దుకాణాలకు రావల్సిన సంబంధిత సిబ్బంది అటుగా కనిపించకుండా ప్రైవేటు వ్యక్తులకు అనుమతులు ఇస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా మొత్తానికి మరో ఏడిరతలు అదనంగా వసూలు చేస్తూన్నారని పలువురు వ్యాపారులు వెల్లడిస్తున్నారు. కాటాలకు అదనంగా సొమ్ము చెల్లించి సీల్స్‌ వేసిన సమయంలో కనిపించని అధికారులు కొత్త ఏడాదిలో కాటా సీల్స్‌ వెయ్యలేదని ఎలా మాటు వేసి వసూళ్లకు పాల్పడుతున్నారో బహిరంగ రహస్యంగానే పరిగణించాలి. సాధారణ వ్యాపారులను బెధిరింపులకు గురిచేసి అదనంగా సొమ్ము వసూలు చేయడం, చెల్లించని యడల కాటాలను బలవంతంగా తీసుకుపోవడం సాధారణ విషయంగా తయారైయిందని వ్యాపారులు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కొన్ని సందర్భాల్లో జరిమానాలు విధించిన సిబ్బంది దుకాణంలో లభ్యమయ్యే వస్తువులను సైతం బెధిరించి తీసుకుపోతున్నారని ఓ వ్యాపారి బహిరంగంగానే వివరిస్తున్నారు.

  • ఏఎంసీ పేరిట తూనికలు, కొలతలు శాఖ సిబ్బంది నయా దందా..
    దుకాణాల్లో వస్తువులు తూనిక చేసే సమయంలో ఉపయోగించే కాటాల వ్యవహారంలో ఓ నయా దందానే నడుస్తుంది. కాటాలకు ఏడాదికి ఓమారు ఏఎంసీతో పాటుగా సీల్స్‌ వెయ్యాలని రూ.వేలల్లో డిమాండ్‌ చేస్తూ చిరు వ్యాపారుల నుంచి దోచుకుంటున్న లీగల్‌ మెట్రాలజీ విభాగ అధికారులు ఓ కొత్త దందాకు నాంది పలికారు. తమ విభాగ సంరక్షణలో ఉన్న కొంత మంది ప్రైవేటు వ్యక్తులను ఏడాదికి సీల్స్‌తో పాటుగా ఏఎంసీ (ఎన్యువల్‌ మెయింటెనెన్స్‌ ఛార్జ్‌) పేరిట రూ.వేలల్లో వసూలు చేయమని పంపిస్తున్నారు. ఆ సమయంలో సంబంధిత దుకాణదారుడు అంత మొత్తంలో సొమ్ములు చెల్లించలేమని చేతులెత్తేస్తే సంబంధిత షాడో సిబ్బంది లీగల్‌ మెట్రాలజీ విభాగ అధికారులకు సమాచారం అందించి ఆ దుకాణంపై దాడులు జరుపుతున్నారు. ఆ సమయంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చిరు వ్యాపారులు జరిమానాలు చెల్లించి బోరుమంటున్నారు. రూ.2వేల నుంచి రూ.3వేల సొమ్ములో ప్రభుత్వానికి రెండు వందలు రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నట్టు రశీదు ఇవ్వడం ఓ సరికొత్త దందా చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. షాడోలు చేసిన దందాతో వ్యాపారులు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నామని ఆరోపిస్తుంటే ఇప్పుడు నేరుగా సంబంధిత విభాగ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులే దుకాణాల వద్దకు వచ్చి రూ.వెయ్యి జరిమానా, అదనంగా మరో రూ.వెయ్యి తీసుకొని ఏఎంసీ అని సీల్స్‌ వెయ్యకుండానే రుసుం వసూలు చేశారు. పైగా నాలుగు రోజుల్లో సీల్స్‌ వెయ్యడానికి వచ్చే వక్తులకు మరికొంత సొమ్ము చెల్లించాలని చెప్పి తప్పించుకున్నారు.
NETRA NEWS
the authorNETRA NEWS

Leave a Reply