NETRA NEWS > Health > మహిళల ఆరోగ్యానికి లోటస్ ఫ్రీ డిజిటల్ మెంబర్షిప్ కార్డ్ భరోసా
నేత్ర న్యూస్, విశాఖపట్నం : మహిళలను గౌరవిచడం అందరి భాద్యతని, అదే బాధ్యతతో లోటస్ హాస్పిటల్స్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ జిల్లాలోని గర్భిణీలందరికీ ఫ్రీ డిజిటల్ మెంబర్షిప్ కార్డ్ అందించడం అభినందనీయమని పార్వతీపురం మన్యం జిల్లా దిశా డి.ఎస్.పి హర్షిత హరిచందన అన్నారు. ఈ సందర్బంగా ఆదివారం స్థానిక హోటల్లో లోటస్ హాస్పిటల్స్ ఫ్రీ మెంబర్షిప్ డిజిటల్ కార్డ్ ను ఆమె ముఖ్య అతిథిగా హాజరై విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళా మూర్తులని గౌరవిస్తూ ఒక ఏడాది పాటు రాయితీ కలిగిన ఫ్రీ డిజిటల్ మెంబర్షిప్ కార్డు అందించడం హర్షణీయమన్నారు. ఈ అవకాశాన్ని గర్భిణీ స్త్రీ లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మరొక అతిధిగా సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ వాణి మాట్లాడుతూ విశాఖలో ప్రప్రథమంగా ఇటువంటి ఫ్రీ డిజిటల్ కార్డు లోటస్ హాస్పటల్ ప్రెవేశపెట్టడం స్వాగతించదగిన విషయమన్నారు. ఈ ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఏడాది పాటు ఈ కార్డు వ్యాలిడిటీ కలిగి ఉంటుందన్నారు. ఈ కార్డు ద్వారా ఇన్వెస్టిగేషన్, కన్సల్టెంట్ కు 40% వరకు రాయితీ పొందవచ్చన్నారు. ప్రస్తుతం ప్రతి కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం భారంగా మారిందని, ఇటువంటి తరుణంలో లోటస్ ఆసుపత్రి డిస్కౌంట్ కార్డు అందించడం శుభపరిణామంగా పేర్కొన్నారు. ముఖ్యంగా గర్భిణీలకు ఈ కార్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఫ్రీ మెంబర్షిప్ కార్డు తీసుకునేందుకు ఫోన్ లో గాని, ఆసుపత్రి రిసెప్షన్ లో గాని సంప్రదించవచ్చని తెలియజేశారు. ఈ సమావేశంలో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళి సంతోష్, డాక్టర్ సంతోష్ కళ్యాణ్, గైనకాలజిస్ట్ లు డాక్టర్ దీప్తి, డాక్టర్ అవంతి, డాక్టర్ సౌఖ్య, అడ్మినిస్ట్రేషన్ ఇంచార్జ్ వెంకటేశ్వర్లు,మధు, పాల్గొన్నారు. సమావేశానికి ముందు హాస్పిటల్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డు లో మహిళల ఆరోగ్యం, భద్రతపై అవగాహన మారథాన్ నిర్వహించారు.
RAVI KUMAR