Please assign a menu to the primary menu location under menu

Weekly Gadgets

Find Us on Socials

Entertainment

జర్నలిస్టులు సమాజ ప్రగతి సాధకులు

★ ఘనంగా ఉగాది సంబరాలు..

★ అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..

★ జర్నలిస్టుల కుటుంబాలకు నూతన వస్త్రాల బహుకరణ..

★ జర్నలిస్టుల సేవలను కొనియాడిన ఏయూ విసీ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి..

నేత్ర న్యూస్, విశాఖపట్నం : సమాజాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని, వారు నవ సమాజ ప్రగతి సాధకులని ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్లు విశాఖపట్నం జిల్లా యూనిట్లు సంయుక్తంగా ఆదివారం ఏయూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అసెంబ్లీహాలులో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించాయి.

ఈ సందర్భంగా ప్రముఖ పండితులు కిరణ్ కృష్ణ పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యoతం అందరిని అలరించాయి. సంగీత కార్యక్రమాలతో పాటు క్లాసికల్ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో కేరింతలతో ఉత్సాహభరితంగా జర్నలిస్టుల కుటుంబాల ఆనందాల సవ్వడితో ఉగాది సంబరాలు అంబరాన్ని ఆంటాయి. అనంతరం జర్నలిస్టుల కుటుంబాలకు నూతన వస్త్రాలను బహూకరించారు.

ముఖ్య అతిథి ప్రొఫెసర్ పి.వి.జి.డి. ప్రసాదరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏయూ సమగ్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. సుమారు మూడు వేల మంది కి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఏయూ నిర్వహిస్తున్న వివిధ కోర్సులలో విద్యార్థుల శాతం పెంచడానికి అవసరమైన మౌలిక, బోధన సదుపాయాలు కల్పించడానికి చేస్తున్న కృషి వల్ల విద్యార్థుల శాతం గణనీయంగా పెరిగిందని తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థులకు అవసరమైన ఉద్యోగ, ఉపాధి రంగాలకు పనికి వచ్చే విధంగా నూతన కోర్సులను తీసుకొచ్చామని చెప్పారు. ప్రాధాన్యత కలిగిన కోర్సులను ఏయూ లో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా ఏయూ పరిసరాలను పరిశుభ్రంగా తయారు చేయడంతో పాటు విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని చెప్పారు. మొత్తం మూడు పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మెరైన్, ఫార్మసీ, ఫుడ్ ఆధారిత శిక్షణ సంస్థలు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఏయూ లో చదువుతున్న విద్యార్థులకు విద్యతో పాటు ఉద్యోగ కల్పన కోసం 79 కంపెనీలతో ఒప్పందాలు జరిగాయని తెలిపారు.

మే నాటికి సుమారు 400 కంపెనీలతో ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందన్నారు. ఏయూ అభివృద్ధిలో మీడియా సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు బయట ప్రపంచానికి తెలియజేయడానికి మీడియా రంగం కృషి చేయాలన్నారు.పంచాంగం పరిణామక్రమమే సైన్స్ అన్నారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, వైజాగ్ జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ సమాజ చైతన్యానికి జర్నలిస్టులు నాంది అన్నారు .ప్రభుత్వ సంక్షేమ పథకాలు విజయవంతంలో జర్నలిస్టుల కృషి ఎనలేనిది అన్నారు.ప్రజలకి ప్రభుత్వానికి మధ్య జర్నలిస్టులు వారిదిగా ఉంటూ సమస్యలను వెలుగులోకి తెస్తూ సమస్యలకు పరిష్కారం చూపుతూ చేస్తున్న సేవలు ఎనలేనివి అన్నారు. తెలుగువారికి ఉగాది ఒక ప్రత్యేక పండుగని, ఈ తెలుగు నూతన సంవత్సరంలో అందరూ ఆయూరోగ్యాలతో ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పోతుమహంతి నారాయణ్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఈ సంబరాలు వారిలో నూతన ఉత్సాహం కలిగిస్తాయన్నారు.ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు,ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు డి. రవికుమార్, ఎ. సాంబశివరావు, జాతీయ కౌన్సిల్ సభ్యులు జి. శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు ఎన్. రామకృష్ణ, కె. మురళీకృష్ణ, రంగాధామం, బొప్పన రమేష్, కోశాధికారి బి. సీతారామమూర్తి, సంయుక్త కార్యదర్సులు పి. కామన్న, ఇజ్రాయిల్, రమణమ్మ, ఎం. వి. రాజశేఖర్  తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీనియర్ జర్నలిస్టులను సన్మానించారు.

RAVI KUMAR
the authorRAVI KUMAR

Leave a Reply