– పెండింగ్ లో ఉన్న ప్రెస్ అక్రిడేషన్లను వెంటనే జారీ చేయాలి..
– జర్నలిస్టులకు 300గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలి..
– లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్(ఎల్ఎన్ఏ) సర్వసభ్య సమావేశంలో నేతలు డిమాండ్..
నేత్ర న్యూస్, విశాఖపట్నం : జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ (ఎల్ఎన్ఏ) అధ్యక్షుడు పి.సత్యనారాయణ డిమాండ్ చేశారు. నగరంలోని ద్వారకానగర్ లో గల పౌర గ్రంధాలయంలో లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనలు లోబడి పత్రికలను నిర్వహిస్తున్నప్పటికీ జర్నలిస్టులకు అక్రిడేషన్లు నిరాకరించడం తగదని, పెండింగ్ లో ఉన్న అక్రిడేషన్లను తక్షణమే జారీ చేయాలన్నారు. అధికార పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీ మేరకు జర్నలిస్టులకు 300 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు.
అసోసియేషన్ కార్యదర్శి ధవలేశ్వరపు రవికుమార్ మాట్లాడుతూ కోవిడ్ తో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు 5లక్షల పరిహారాన్ని వెంటనే చెల్లించాలని కోరారు. స్థానిక దిన పత్రికలకు, పిరియాడికల్స్ కు తగినన్ని సమాచారం, పౌర సంబంధాల శాఖ యాడ్స్ విడుదల చేసి ఆయా పత్రికల చేయూతనివ్వాలన్నారు. సీనియర్ జర్నలిస్టు ఎన్.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రమాద బీమా పథకాన్ని జర్నలిస్టులకు అమలు చేయడం లేదని, జీఎస్టీ నిబంధన వలన స్థానిక పత్రికలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తక్షణమే తొలగించాలన్నారు.
అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బి.నారాయణ రావు మాట్లాడుతూ అక్రిడేషన్ లకు సంబంధించిన జీవో నెంబర్-142ను సవరించి జర్నలిస్టు సంఘాలకు అక్రిడేషన్ కమిటీలలో ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. హేమ సుందర్ మాట్లాడుతూ జర్నలిస్టులకు నెలకు 5వేలు పెంక్షన్, ఉచితంగా హెల్త్ కార్డులు జారీ చేయాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు అర్.అబ్బాస్, చక్రవర్తి, రవికాంత్, వెంకట వేణు, తిర్లంగి హరి, శివప్రసాద్, జి.ఆనంద్, హరనాథ్, దొండా రమేష్, బాదంగీర్ సాయి, కొణతాల మోహనరావు, బి.ఏ.నాయుడు, మొల్లి కమల్ కుమార్, వి.గణేష్, నాయుడు యాదవ్, భగవాన్, ఎం.శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Super..👌