నేత్ర న్యూస్, విశాఖపట్నం : విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నివాసంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుమారు 25నిమిషాల పాటు గడిపారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే వాసుపల్లి కుమారుడు సూర్య వివాహం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వధూవరులు సూర్య, రాశీలను ఆశీర్వదించడానికి అయన నివాసానికి మంగళవారం మధ్యాహ్నం చేరుకున్నారు.
అచ్యుతాపురం పర్యటన అనంతరం విశాఖ విమానాశ్రయం నుంచి మర్రిపాలెంలో గల వాసుపల్లి నివాసానికి మధ్యాహ్నం 1.30గంటలకు చేరుకున్న సీఎం జగన్ నూతన వధూవరులను ఆశీర్వదించి ఫోటోలు దిగి కాసేపు ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం రోడ్డు మార్గంలో వాసుపల్లి నివాసం నుంచి విశాఖ విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళ్లారు. నూతన దంపతులను ఆశ్వీరదించిన వారిలో మాజీ పార్లమెంట్ సభ్యులు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు గుడివాడ అమర్నాధ్, విడదల రజినీ, ప్రముఖులు, పార్టీ శ్రేణులు హాజరయ్యారు.