నేత్ర న్యూస్: తెలంగాణ మంత్రి కేటీఆర్ విసిరిన ఛాలెంజ్‌ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ యాక్సెప్ట్ చేశారు. ఇంతకీ ఏం ఛాలెంజ్ అనుకుంటున్నారా..? చేనేత ఛాలెంజ్.. ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత బట్టలు ధరించి ఆ ఫోటోలు లేదా వీడియోలు పోస్ట్ చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, పవన్ కళ్యాణ్, ఆనంద్ మహీంద్రాలకు మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో ఛాలెంజ్ విసిరారు. ట్విటర్‌లో ఈ ఆసక్తికర విషయం చోటుచేసుకోవడంతో ఒక వైపు పవన్ అభిమానులు మరో వైపు కేటీఆర్ అభిమానులు సంబ్రమాశ్చర్యంలో పడ్డారు.
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ #MyhandloomMyPride ఛాలెంజ్‌ను స్వీకరించి మరో ఇద్దరిలో మంత్రి కేటీఆర్‌ను నామినేట్ చేశారు. ఈ ఛాలెంజ్‌లో నామినీలు చేనేత దుస్తులు ధరించిన వారి చిత్రాలను పోస్ట్ చేయాలి.. అదే విధంగా చేయడానికి మరో ముగ్గురిని నామినేట్ చేయాలి. మంత్రి కేటీఆర్ సవాల్‌గా తీసుకుని సచిన్ టెండూల్కర్, ఆనంద్ మహీంద్రాతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను నామినేట్ చేశారు. కొన్ని గంటల్లో పవన్ కళ్యాణ్ ఛాలెంజ్‌ని స్వీకరించి, చేనేతలో ఉన్న తన చిత్రాలను పోస్ట్ చేశాడు.
ఇక్కడితో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చూశామనేలోపే పవన్ కళ్యాణ్ చేసిన ఛాలెంజ్ ఏపీలో రాజీకీయా అనుమానాలతో పాటుగా పొత్తుల టాపిక్ మల్లి బయట పడింది. ఆసక్తికరంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు వైసీపీ మాజీ మంత్రి బాలినేని వాసు, బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌లను ఆయన నామినేట్ చేశారు.
“@KTRTRS రామ్ భాయ్ యొక్క ఛాలెంజ్ ‘మా నేత కమ్యూనిటీల పట్ల నా ప్రేమ మరియు అభిమానానికి కారణం. ఇప్పుడు నేను శ్రీ @ncbn శ్రీ @balineni_vasu శ్రీ @drlaxmanbjpని నామినేట్ చేసాను. వారి చేనేతతో ఉన్న చిత్రాలను పోస్ట్ చేయడానికి, #NationalHandloomDayలో వారి ప్రేమను తెలియజేయాలని ”పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో రాశారు.